Sunday, July 14, 2019

మ >>>> 10

* మసీదికాలె మదార్ సాబ్ అంటే, సందెడు బొంతలు చంకనున్నాయి అన్నాడట.
* మహాంతమైన లొల్లి మానెడు వడ్లు అలుకదు.
* మహాభారంలో ఆదిపర్వతం అన్నట్లు.
* మహామహావాళ్ళు మడుగులో పడుతుంటే కోణంగి దాసరి కోనేటిలో పడెనంట.
* మహామహావాళ్ళు మదుళ్ళకింద ఉంటే పుల్లాకు నా గతేమి అన్నదట.
* మహామహావాళ్ళు మదుళ్ళకింద ఉంటే, గోడ చాటు వారికి శరణు శరణు.
* మహామహావాళ్ళు మన్ను మూకుళ్ళు అయిత్యే, నీవొక జల్లిమూకుడివి.
* మహారాజావారని మనవిచేసుకుంటే, మరి రెండు వడ్డించ మన్నాడట.
* మహారాజుకైనా మన్ను నమ్మిన వాడే అన్నం పెట్టాలి.
* మహారాజు పెంతదింటే మందుకు, పేదవాడు తింటే కూడులేక అన్నట్లు.
* మహారాజులమే కాని, పొయ్యి రాజదు.
* మహాలక్ష్మి పండుగకు మాడెత్తు చలి.
* మహావృక్షం క్రింద మొక్కలు పెఱుగవు.
* మాంసం తింటామని ఎముకలు మెడకు కట్టుకుంటామా?
* మాంసం తింటాడని పేగులు మెడలో వేసుకుంటాడా?
* మాంసం తినేవాడు పోతే, బొమికెలు తినేవాడు వస్తాడు.
* మాంసం మాంసాన్ని పెంచుతుంది.
* మాంసమంటే సైసుయ్ పైసలంటే కైకుయ్
* మా ఆయనే ఉంటే, మంగలివాణ్ణి అయినా పిలుచుకు వచ్చేవారు కదా.
* మా ఇంటాయనకు మగతనముంటే, పొరుగింటాయన పొందెందుకు?
* మా యింటికొస్తే మాకేం తెస్తావు? మీ ఇంటికొస్తే మాకేమి ఇస్తావు?
* మా కాయుష్యమస్తు! మా కారోగ్యమస్తు! అని దీవించుకొనినట్లు.
* మాకు కుడుము, మీకు వక్క (మూకుడు).
* మాగి చెడ్డ గొడ్డు మాదిగింటికైనా తగదు.
* మాగి పొద్దు మాటాడ దీరదు.
* మాగిలి దున్నితే మరింత పంట.
* మాగిలి దున్నితే మాలవానికైనా పైరగును.
* మాఘ(ఖ) ,మాసపు చలి మంటలో పడ్డా తీరదు.
* మాఘమాసపు వాన - మగడులేని చాన.
* మాఘమాసంలో మ్రాకులు సైతం వణకును.

No comments:

Post a Comment