Sunday, July 14, 2019

మ >>>> 15

* మారు పెట్టించుకోక (పోసుకోకుండాపోతే) మరల రాదు (మారు=మజ్జిగ, మరల పెట్టించుకొనుట).
* మారు లేని తిండి మాల తిండి, దొరలేని తిండి దయ్యపు తిండి.
* మారులోకానికి వెళ్ళినా, మారు తల్లి వద్దు.
* మార్గశిరంలో మాట్లాడటానికి పొద్దుండదు.
* మార్గశిరాన మామిడి పూత.
* మార్జాలస్వప్నాలు మాంసం మీదనే.
* మాలకు మాంసం గొడారికి తోలు (గొడారి=మాదిగ).
* మాలకూటికి పోయినా నీళ్ళపప్పే.
* మాలకూటికి లోబడ్డా పప్పుబద్ద దొరకలేదు.
* మాలజంబం మల్ల (మూకుడు) మీద, వానజంబం ఊసరం మీద.
* మాలదాన్ని ఎంకటమ్మ! అంటే, మదురెక్కి నీళ్ళచాయ కూర్చున్నదట (నీళ్ళచాయ=చెంబట్లు, దొడ్డికిపోవుట, నీటివైపుపోవుట అనుట).
* మాలదాన్ని ఎంకటమ్మ! అంటే, మరికాస్త ముందరింట్లోకి వచ్చిందట.
* మాలదాన్ని ఎంకటమ్మ! అంటే, మఱింత బిగుసుకొన్నదట.
* మాలపల్లెలో మంగళాష్టకాలు.
* మాలపున్నమ ముందర మాదిగవాడైనా చల్లడు.
* మాలబంటుకు ఇంకొక కూలిబంటా?
* మాలబింకె(కా)లు మందబయలున, వానబింకాలు బొల్లిచవుళ్ళలోను.
* మాలముద్దు వెన్నగాల్చి పెట్టబోయిందట.
* మాలలకు మంచాలు, బావలకు పీటలా?
* మాలవాడ కుక్క మఱి అన్న మెఱుగునా?
* మాలవాడ(ను) కుక్క మరగిన చందంబు.
* మాలవాడి పెళ్ళి మహసూల్ తో సరి (మహసూల్ = కుప్పనూర్పిళ్ళు).
* మాలవాడు చేసినట్లు ఉండాల, సంసారి చెడ్డట్లే ఉండాల.
* మాలాయగారికి తోలాయ గారు గురువు.
* మాలీషు చేసినట్లూ ఉణ్దవలె, కాపు చెడ్డట్లూ ఉందవలె.
* మాలోడికి నాకెందు కింతపెద్ద వాలగ అన్నాడట (వాలగ =ఒక రకమైన చేప).
* మావాడు దెబ్బల కోరుస్తాడు అంటే, విడిపించే దిక్కులేక అన్నట్లు.
* మావాళ్ళు వద్దన్నందుకు, మంగళగిరి తిరునాళ్లకు వెళ్ళినందుకు నాపని ఇంటే కావాలి- అన్నదట.
* మావళ్ళు వద్దన్నదానికి, నేను వచ్చినదానికి, ఇతణ్ణపుదానికి, యిట్లానే కావాల కొట్టుకో మన్నదట.
* మావి మాకిస్తే, మడిమాన్యా లిచ్చినట్లు.

No comments:

Post a Comment