Sunday, July 14, 2019

శ - ష >>>> 1

* శంకులో పోస్తే తీర్థం, పెంకులో పోస్తే నీళ్ళు.
* శంఖంలో (తో) పోస్తేగానీ తీర్థం కాదు.
* శకునంవేళ ఎక్కడికని అడుగకూడదు గానీ ఎక్కడికో చెప్పిపో అన్నట్లు.
* శక్తి ఎవరిసొమ్ము యుక్తిచే సాధింప.
* శక్తిచాలనివాడు సాధుత్వము వహించు.
* శఠగోపం లేకుంటే నా శంఠంపోయేగానీ ఇంట్Yఇకిపోయి గంటె బోర్లించుకుంటాను.
* శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు.
* శతాపరాధములకు సహస్త్రదండనములు లేవు.
* శనగలు తిని చేయి కడుగుకొన్నట్లు.
* శని పట్టితే ఏడేళ్ళు, నేను పట్టితే పద్నాలుగేళ్ళు.
* శనిపీనుగా తనిగా పోదు (తనిగా=ఒంటరిగా)
* శనివారం వాన శనివారమే విడుచును.
* శని విఱగడ, పని ఒబ్బిడి.
* శనేశ్వరానికి నిద్ర ఎక్కువ, దరిద్రానికి ఆకలెక్కువ.
* శయనైకాదశి తెలిసినవాడే శాస్త్రకారుడు.
* శరణార్థిని లింగప్పా! అంటే, కందులు మూడుమాడలు అన్నాడట; చిన్నాపెద్దా బాగున్నారా? అంటే, పప్పు లక్కవలే ఉడుకుతుంది అన్నాడట.
* శరత్కాలవర్షం, గృపణుని ఔదార్యం వంటిది.
* శరము చాటేడు, చెప్పులు మూటెడు.
* శరము తప్పిన చెవులు వినరావు, గుణము తప్పిన కళ్ళు కానరావు.
* శల్య సారథ్యం.
* శవం బరువని శష్పాలు బెరికి వేసినట్లు.
* శవానికి చేసిన అలంకారం వలె.
* శాంతము లేక సౌఖ్యము లేదు, దాందునికైనా, వేదాంతునికైనా.
* శాగరోకలి యిరుగు పెట్టినట్లు.
* శాపాలకు చచ్చినవాడు, దీవనలకు బ్రతికినవాడు లేడు.
* శాఫాళు ఊత్సవాలవంటివి, అవి ఊరేగి ఊరేగి బయలుదేరిన చోటుకే వచ్చిచేరును.
* శాస్త్రం తప్పు, చచ్చేది నిజం.
* శాస్త్రప్రకారం విషయిస్తే కుక్కమూతి బిడ్డలు పుట్టినట్లు.
* శాస్త్రులవారింట పుట్టి, సోమయాజుల వారింట మెట్టి, లవణమంటే దూడరేణమని (పేడని) ఎఱుగనా? అన్నదట.
* శాస్త్రులవారు కొడుకు బ్రతికి నిర్వాహకుడే, చచ్చీ నిర్వాహకుడే (నిర్వాహకుడు= మోసెవారు లేరని, బాగా నిర్వహించుకొనేవాడని అర్ధాంతరము).

No comments:

Post a Comment