Sunday, July 14, 2019

మ >>>> 20

* ముక్కు దాటితే ముఱికి, నాలుక దాటితే నరకం.
* ముక్కు నలిపి దీపం పెట్టమంటే, మొగుడి (మామ) ముక్కు నలిపిందట.
* ముక్కు పట్టని ముత్యం, చెవు పట్టని కమ్మ.
* ముక్కు పట్టిన వానిచేత చీదించినట్లు.
* ముక్కు పట్టుకుంటే ప్రాణం పోతుంది (దుర్బలుడనుట).
* ముక్కు మూరెడు, సిగ బారెడు.
* ముక్కు మూసుకుంటే, మూడు ఘడియలు.
* ముక్కు మొగం లేని బిడ్డ, మొదలు తుది లేని పాట.
* ముక్కులో ఏవేలు పెట్టినా సరిపోతుంది.
* ముక్కులో చీమిడొయ్! అంటే, నీచేతితోనే కాస్త తీసివేయ మన్నాడట.
* ముక్కులోని వెంట్రుక కొప్పులోనికి వచ్చి, మూగవాడు అమ్మా! అన్ననాటికి చూతాంలే.
* ముక్కెడి ముక్కుకు తక్కెడు బంగారమట.
* ముఖం అందం, ముడ్డికి చేటు.
* ముఖము చూస్తే కనబడదా మీగాళ్ళ వాపు?
* ముఖము తేట, ముడ్డి తీట.
* ముఖము బాగోలేదని అద్దం పగులగొట్టినట్లు.
* ముఖము మాడుపు దీపమింటికి కొరగాదు, ఱంకుబోతు పెండ్లాం మొగుడికి కొరగాదు, ఏడ్పుగొట్టు బిడ్డ చంకకు కొరగాదు.
* ముఖములో సుఖంలేదు, మోకాళ్ళలో బిగువులేదు.
* ముఖస్తుతి, చేసినవానిని చేయించుకొనినవానిని ఇద్దరిని చెరచును.
* ముఖానికి ముక్కాసర, దండకు కొలికాసర.
* ముఖాలు చూచి బొట్టు పెడతారు, పిఱ్ఱలు చూచి పీటవేస్తారు.
* ముగ్గిరి మధ్య ముంత దాగింది.
* ముగ్గుపిండి అట్లకు పనికి వచ్చునా?
* ముగ్గురికి తెలిస్తే మూడులోకాలకు పాకుతుంది.
* ముగ్గురిని కూల్చెరా ముండదైవం.
* ముగ్గురు ఆడవాళ్ళు కూడితే, పట్టపగలే చుక్కలు పొడుస్తాయి.
* ముగ్గురు బిడ్దలను కంటే, ముసలివానికైనా కొరగాదు.
* ముగ్గురు మూడు లోకాలయితే, ముసలిది మాయలోకం.
* ముగ్గురెక్కిన బండి పొలిమేర దాటదు.
* ముచ్చు ముండకేల ముంజేతి కడియాలు?

No comments:

Post a Comment