Sunday, July 14, 2019

మ >>>> 22

* ముది మదితప్పిన మూడు గుణాలు.
* ముదిముండ పాతివ్రత్యమునకు జొచ్చినట్లు (వృద్ధనారి పతివ్రత)
* ముదిమికి ముచ్చట్లు లావు.
* ముదియగా ముదియగా మోహము లావు.
* ముదిరి చచ్చినా, ఎండి ఇడిసినా వగపులేదు.
* ముదురున వెసిన పైరు, ముదిమిన పుట్టిన కొడుకు.
* ముద్ద తలతిరిగి నోటికి వచ్చినట్లు.
* ముద్ద ముద్దకీ బిస్మిల్లానా?
* ముద్దరాలు మగడు ముదుసలి(ని) మెచ్చునా?
* ముద్దవేసిన తట్టు, మూతినాకుడు మాటలు.
* ముద్దు చేసిన కుక్క మూతి నాకును, చనువు చేసిన భార్య చంక కెక్కును.
* ముద్దున పేరు చెడె, మురిపాన నడక చెడె.
* ముద్దులయ్య పోయి, మొద్దులయ్య అయినాడు.
* ముద్దులాడితే ముక్కు నొక్కినట్లు.
* ముద్దు మురిపం మావంతు, ముడ్డి దొడ్డి మీవంతు.
* ముద్ర ముద్రగానే ఉండగా, ముగ్గురు బిడ్డల తల్లి అయినట్లు.
* ముద్రలందు లేదు మూలమందేగాని.
* మునగ చెట్టుకు మున్నూరు రోగాలు.
* మునిగింది ముర్దారు, తేలింది హలాలు (ముర్దారు=అపవిత్రము; హాలాలు=పవిత్రము).
* మునిగితే గుండు, తేలితే బెండు.
* మునిగేవానికి తెలుసు నీటి లోతు.
* మునిమాపటిమాటలు ముందుకు రావు.
* మునుపుచెడ్డ ముత్తెమ్మా, గరిగబుడ్డి సమంగా బెట్టు.
* మున్నీరుచే యీత నీదినట్లు.
* మున్నూట అరవైనాలుగు శిగములున్నా ఒకటే, ముఫైఆరు గుల్లికొప్పు లున్నా ఒకటే.
* మున్నూటరువది రోగాలకు మూడు గుప్పిళ్ళ కరక్కాయ పొడి.
* మున్నూటికులానికి ముప్పు లేదు, మొండికాలికి చెప్పు లేదు.
* మున్నూరు కాపత్తకు ముష్టికోడలు.
* మున్నూరు రూపాయలిచ్చి అయినా, ముసలిదానిని కొనాల.
* మున్నూరు వరహాలు పోయె, మూతి మీసాలు పోయె, నంబి సోమయాజులు అన్నమాట తప్పదాయె.

No comments:

Post a Comment