Sunday, July 14, 2019

స >>>> 2

* సంధ్య వార్చినావురా? అంటే, ఊరివెలుపల గుంటలో వార్చినా నన్నాడట. అయితే ఆ గుంటలో నీళ్ళు లేవే? అంటే, చాకలి సుబ్బుడు ఉన్నవని చెప్పినాడు నాయనా! అన్నాడట.
* సంపద గలదేని సన్నిపాతము పూను.
* సంపదగలిగినవాని సన్నిపాతం వలె.
* సంపదగలిగిన్ తల్లికి వేకటిగాని తీరదు.
* సంపదలున్న నాడే బంధువుల రాక, చెరువు నిండినవాడే కప్పల చేరిక.
* సంపదలో మరపులు, ఆపదలఓ అఱపులు.
* సంపద స్నేహితులను కల్పించును, దరిద్రము వారిని ఒకటిగా బంధించును.
* సంపద ఒకరిది, అనుభవం ఇంకొరరిది.
* సంబరపు చలిగాలికి ఎదురువాకిలి వలె.
* సంబరానికి సోకి పోసికుంటే, కిక్క జమిడికే ఏనుకపోయిందట (జమిడికే=జంటాయికే).
* సంభావనలో వచ్చిన పావలా లోటు, నేతిలో తీస్తా నన్నట్టు.
* సంసారం గట్టి, మెడ ఒట్టి.
* సంసారం గుట్టు, వ్యాధి రట్టు.
* సంసారం జానెడు, ఖర్చు బారెడు.
* సంసారం బాగాలేదని సన్యాసం పుచ్చుకుంటే, బూడిద బుఱ్ఱకాయ గాడిద బరువైనాయట.
* సంసారం లేనివారికి సరసాలెక్కువ.
* సంసారం సాగనిది ఆడదాని వ్రాత, పిల్లలు బ్రతకనిది మొగవాని వ్రాత.
* సంసారికి సాగు వాటు, సన్యాసికి జోగు వాటు.
* సంసారి తిరిగి చెడును, సన్యాసి (జోగి) తిరుగక చెడును.
* సంసారి దుఃఖి, సన్యాసి సుఖి.
* సంసారి బీద గానీ చేను బీద గాదు.
* సంసారి సైయ్ - సన్యాసి సైయ్ అన్నాడట చలికిచచ్చే సన్యాసి.
* సంస్కారంలేని చదువు కాయగాయని చెట్టువంటిది
* సకలశాస్త్రాలు, నిలబడి మూత్రాలు.
* సకలసబ్బండు గోత్రానాం, పుల్లమ్మ పుత్రానాం.
* సక్కీలు పలికెవానికి సేలు(రు), మొద్దుగొట్టేవానికి దుడ్డు.
* సగం ఈడుకు సమర్తకట్నాలు.
* సగం చచ్చి పురాణం, అంతాచచ్చి సంగీతం.
* సగం పెట్టి, మేనత్త అన్నట్లు.
* సగం సాలె నేత, సగం మాల నెత.

No comments:

Post a Comment