Sunday, July 14, 2019

మ >>>> 31

* మొదటికే మోసమైతే, లాభానికి గుద్దులాట.
* మొదటికే మోసమైతే, వడ్డి ముట్టలేదన్నాడట.
* మొదటి చూపుకే కలిగిన వలపుకు కాలయాపన లేదు.
* మొదటిదానికి మొగుడు లేడు, కడదానికి కల్యాణమట.
* మొదటి పెండ్లి అవసరము, రెండోపెండ్లి అవివేకము, మూడోపెండ్లి అపస్మారకము.
* మొదటిముద్దుకే మూతిపండ్లు రాలినట్లు.
* మొదలుంటే పిలకలు పెడుతుంది.
* మొదలు మునిగితే వడ్డి మునుగదా?
* మొదలు చేవలేక తుద నెట్లు కలుగురా?
* మొదలు మోదుగ పూస్తే, కొన సంపెంగ పూస్తుందా?
* మొదలు లేదు శ్రీరామా! అంటే, మొలతాడు లేని పాతగోచి అన్నాడట.
* మొదలు లేదు సుబ్బక్కా! అంటే, ఒక్కదేవరకైనా మొక్కాక్కా అన్నదట.
* మొదలు లేదు సుబ్బక్కా! అంటే, ముంతేది పెద్దక్కా అన్నదట.
* మొదళ్ళు మీకు, మోసులు మాకు.
* మొదలు విడిచి కొనలకు నీళ్ళు బోసినట్లు.
* మొదలే కుంటికాలు, దానికితోడు పక్షవాతం.
* మొదలే కోతి, పైగా కల్లు తాగినట్లు.
* మొదలే మన్ను, కఱవు వస్తే గడ్డలు.
* మొద్దు (మోటు) ముందకు దొరికేదంతా మోటు శిశినాలు.
* మొద్దు మొగానికి తోడు, గరుడసేవా?
* మొప్పెకు మూరెడు నోరు.
* మొప్పెకు మొగిలిపువ్విస్తే, మడిచి (ముడ్డి) గుద్దలో పెట్టుకున్నదట.
* మొయిలువిడిచిన యెండ, మొగుడువిడిచిన ముండ, పట్టివిడిచిన మండ, ఎత్తివిడిచిన కుండ.
* మొఱకకు సివమెత్తిన మ్రొక్కక తప్పదు.
* మొఱిగే కుక్క కఱవదు (అరిచే కుక్క).
* మొఱ్ఱలో మొఱ్ఱ మొండిచెయ్యి చూపించేయి.
* మొఱ్ఱో! మొఱ్ఱో! వద్దనగా, లింగం కట్టేరుగానీ మొక్కచేతులు తేగలరా?
* మొలది విప్పి తలకు చుట్టినట్లు.
* మొలబంటి దుఃఖంలో, మోకాలిబంటి సంతోషం.
* మొలిచేచెట్టు మొలకలోనే తెలుస్తుంది.

No comments:

Post a Comment