Sunday, July 14, 2019

స >>>> 5

* సర్కారుకు చాటుగా ఉండాలి, సావుకారి కెదురుగా ఉండాలి.
* సర్రాజు పెళ్ళిలో గుర్రాజుకో పోచ.
* సర్వజనీనమైన భాష సంగీతము.
* సర్వవిషయములలో మానవుడుగా మనుము.
* సర్వేజనా స్సుఖినోభవంతు అంటే, సర్వేవాళ్ళేనా? మనసంగతేమి? అన్నారట - రెవెన్యూ వాళ్ళు.
* సలిలం కమ్మ లంజలం (సలిలం-కం-లం-జలం) అని, అమరం చదివితే, కమ్మలంజలేం? కాపులంజ లెందుకు కాకూడదు? అన్నాడట.
* సవతాలి కుండనైనా ఉడుకుతానన్నది గాని, తోడికోడలి కుండను ఉడుకనన్నదిట.
* సవతితల్లికి బిడ్డలు పోతేనేమి? సొమ్ముల కాపువానికి బక్కలు (బక్కగొడ్లు) పోతేనేమి?
* సవతికి సంకెళ్ళు, నాకు పిల్లెండ్లు.(పిల్లెండ్లు=ఆభరణాలు, కాలివేళ్ళను పెట్టుకొనేవి).
* సవతి సాగనీయదు, ఏరా లెచ్చనీయదు.
* సవరణ సంతకుపోతే, ఏకులబుట్ట ఎదురుగా పోయిందట.
* సవరదీసినకొద్దీ నిక్కినట్లు.
* సవాసేరులో బోడిపరాచకమా?
* సస్యాధిపతివా? సామ్రాజ్యాధిపతివా?
* సహనముంటే పశ్చాత్తాపానికి చోటులేదు.
* సాకు (సాకులు) మేకవుతుంది.
* సాకులు చెప్పినవానికి కాసు, ఇల్లుకప్పిన వానికి దుగ్గాని.
* సాగింది నిజము, సాగనిది దబ్బఱ (కల్ల).
* సాగితే చాపకిందికి ఆరు కుంపట్లు, తొమ్మిది నెగళ్ళు.
* సాగితే నియోగం, సాగకపోతే చచ్చేయోగం.
* సాగితే పాకనాటివారు, సాగకున్న మోటాటివారు.
* సాగితే బండి, సాగకపోతే మొండి.
* సాగితే బొంకు, సాగకపోతే రంకు.
* సాగితే సాగించుకోమన్నారు, జారితే పడమన్నారు.
* సాగినప్పుడు పడుదునా? త్రాగినప్పుడు పడుదునా?
* సాగినమ్మ చాకలితో సరసం ఆడితే తప్పులేదు, సాగనమ్మ సంసారితో మాట్లాడినా తప్పే.
* సాగినమ్మ చాకలివాడితో పోతే అది వ్రతమేమో అనుకున్నారట.
* సాగువాటు చాలనాళ్ళాయె, గొగుకూర తెండమ్మా గోక్కు తిందామన్నదిట.
* సాటీమ్మ సరిగా పెట్టుకుంటే, ఊరి అమ్మ ఉరిపెట్టుకున్నదట.
* సాటివారితో సరిగంగ స్నానాలు చేస్తుంటే, ముసలి మొగుణ్ణి కాస్తా మొసలెత్తుక పోయిందట.

No comments:

Post a Comment