Sunday, July 14, 2019

మ >>>> 5

* మచ్చాలు (మత్యాలు) దినే నోటికి సొచ్చాలు ఎట్లా వస్తవి? అన్నాడట.
* మజ్జిగకు వచ్చి బఱ్ఱెను బేరమాడినట్లు.
* మజ్జిగకు వచ్చి, ముంత దాచినట్లు.
* మట్టికుండలో ఉంటే మనోవ్యాధి, తోలుపొట్టలో ఉంటే తోచి ఉంటుంది.
* మట్టిగడ్డలో కప్ప కూస్తే ఒక జాములో వాన.
* మట్టిగుఱ్ఱాన్ని నమ్మి, ఏట్లో దిగినట్లు.
* మట్టిగోడ కడితే రొంపే.
* మట్టు మీరు మాటకు మారు లేదు.
* మట్టేద్దయినా మా ఎద్దే మంచిది.
* మడత కుడుములు, శేషపాంపులు.
* మడికి గట్టు, ఇంటికి గుట్టు.
* మడికి గట్టు, మాటకు గుట్టు.
* మడికి మంద, చేనుకు ఎరువు.
* మడిచారుమీద మనుపోయ, అటికెడు చారు బోర్ల పోయెనే.
* మడి దున్ని మనినవాడు, చేను చేసి చెడినవాడు లేడు.(మడీ=మాగాణి; చేను=మెట్ట).
* మడి దున్ని మహారాజైనవాడు, చేనుదున్ని చెడ్డవాడు లేడు.
* మడిన పడ్డనీరు, పైపడ్డ దెబ్బ పోవు.
* మడిమల్లేసి బిదాణం పీకేసి సరువ కోసేసి.(బిదాణం=తులసికోట; సరువ=బిందె; చెరవ=చేదుటకు ఉపయోగించునది).
* మడి బీదకాదు, రైతు పేద గాని.
* మడుగు చీరకు మసి తాకినట్లు (మడుగు=చలువచేసి మడతపెట్టిన గుడ్డ).
* మడ్డిముండకు మల్లెపూలిస్తే, మడిచి ముడ్డికింద పెట్టుకున్నదట.
* మణిని మణితో కోయవలె (వజ్రం వజ్రాన్ని భేదిస్తుంది).
* మణుం గొట్టగా మాసం చిక్కినాడు.
* మణుగు సగము, మైలా సగమే.
* మణులు చెక్కిన సంకెళ్ళ వలె.
* మతి ఎంతో గతి అంత.
* మతిమరపువాడు నీళ్ళచాయకు (చెంబొట్లకు) పోయినచోట ముడ్డి మరచివచ్చినాడట.
* మతిమరుపుల వానికి ముల్లిరుపుల వాడు.
* మతిమరుపులో నీళ్ళలో బడి, ఈదను మరచిపోయినాడట.
* మతిమీద మన్ను పోతు, ఉప్పుకు పోయి నిప్పు తెత్తు.

No comments:

Post a Comment