Sunday, July 14, 2019

స >>>> 7

* సావుకారు చతికిలబడితే, పీట వెల్లకిల బడిందట.
* సాహసంలేని వాడికి కత్తి సరిగా తెగదు.
* సాహెబు ఎన్ని సుభాలేలినా బేగమునకు కుట్టుపోగులే.
* సాహెబులా! సెదాములు, సలాము లేవయ్యా? అంటే దొరలు దాతలు పట్టంచు ధోవతు లిచ్చిన ఇనాములేవయ్యా? అన్నాడట.
* సాహెబ్ కు సాడే తీన్. నాకు మూడున్నర.
* సాక్షికాళ్ళు పట్టుకోవడం కన్న, వాదికాళ్ళు పట్టుకోవడం మేలు.
* సింగడికేల పత్తి బేరము? (సింగడు=దిశమొలవాడు; బిత్తలి).
* సింగన్నా! అద్దంకి పోయినావా? అంటే, పోనూపోయా, రానూవచ్చా అన్నాడట.
* సింగారం జూడరా బంగారు మొగుడా.
* సింగి కంటే (నీళ్ళాడితే)- సింగడు పథ్యం చేసినట్లు (ఇంగువ తిన్నట్లు).
* సింగినాదం, జీలకఱ్ఱ.
* సింగి నీళ్ళాడితే సింగడు ఇంగువదిన్నట్లు.
* సింహంగూడ చీమకు భయపడే (తలకే) అదును వస్తుంది.
* సింహంలో చీరి ఊడ్చడమున్నూ, కన్యలో కంగా పింగా ఊడ్చడమున్నూ.
* సింహాసనంపై దున్నపోతు, లంజలలో పతివ్రత, ముత్తైదువులలో ముండమోపి.
* సిగ్గంత పోయె చిన్న పెండ్లామా! పెండ్లికన్న పోదాం పెద్ద పెండ్లామా! అన్నాడట.
* సిగ్గు చాటెడు, చెప్పులు మూటెడు.
* సిగ్గు చిన్ననాడే పోయె, పరువు పందిట్లో పోయె, కొరవా సరవా ఉంటే గదిలో పోయె.
* సిగ్గు చెడ్డా బొజ్జ పెడితే చాలును.
* సిగ్గు తోటకూరవంటిది (చాలా సుకుమారము).
* సిగ్గు దప్పిన చుట్టం వన్నెచీర కేడ్చిందట.
* సిగ్గుపడితే సిద్దె కట్టిపడుతుంది.
* సిగ్గుబోవు వేళ చీర లబ్బినట్లు.
* సిగ్గుమాలినదాన్ని చిటికేస్తే, ఆరామడనుంచి ఆలకించిందట.
* సిగ్గులేని అత్తకు మోరతోపు అల్లుడు.
* సిగ్గులేని చిన్నాయనా, విడిచిన చిన్నమ్మను ఇంకా కొడుతావా?
* సిగ్గులేని ముఖానికి నవ్వే అలంకారం.
* సిగ్గులేని రాత్రికి ఏటా జాగారమే!
* సిగ్గు విడిస్తే రాయలకూడు, తిరుపతికి పోతే బోడితల.
* సిగ్గువిడిస్తే శ్రీరంగము, అంతకూ విడిస్తే బోడితల.

No comments:

Post a Comment