Saturday, June 15, 2019

అ - ఆ >>>> 11

* అపుత్రుడికి గతి లేదు
* అప్పచెల్లెలు బ్రతక గోరితే తోడికోడలు చావు కోరుతుంది
* అప్ప సిరి చూసుకుని చెల్లెలు మడమలు విరగ త్రొక్కుకుందట
* అప్పటి కోపం అన్యాయ మెరుగదు
* అప్ప సంపాదించిన ఆస్థి మనుమడితో మట్టిపాలు
* అప్పిచ్చే నాకొడుకుంటే దొంగతనం ఎందుకు?
* అప్పు అదనుకు, ఆకటికీ రాదు
* అప్పు ఆదా కాదు - వాపు బలుపూ కాదు
* అప్పు ఆరు తెన్నులు - ముప్పు మూడు తెన్నులు
* అప్పు యిచ్చి చూడు - పిల్ల నిచ్చి చూడు
* అప్పు ఇచ్చినవాడు బాగు కోరితే తీసుకున్నవాడు చెడు కోరతాడు
* అప్పు చేసి కొప్పు తీర్చినట్లు
* అప్పు చేసి పప్పుకూడు
* అప్పుడనే మాటను ఆర్నెల్లు ఆగి అనాలి
* అప్పులున్నవాడి వెంట, చెప్పులున్నవాడి వెంట వెళ్ళరాదు
* అప్పులెందుకు మిగిలాయిరా అంటే ఎగ్గొట్టటం చేతకాక అన్నాడట
* అప్పు లేని గంజి గరిటడే చాలు
* అప్పులేనిదే ఒక సంపద / ఐశ్వర్యం
* అప్పులేని మనిషి - పిప్పిలేని పగడం ఉంటాయా?
* అప్పు లేనివాడే అధిక బలుడు / పుణ్యాత్ముడు
* అబద్ధం అంటే అతుకుల మాట
* అబద్ధం చెబితే అన్నం పుట్టదు - నిజం చెబితే నీళ్ళు పుట్టవు
* అబద్ధమాడితే గోడ కట్టినట్లుండాలి
* అబద్ధానికి అంతు లేదు
* అబద్ధాల మనిషికి అరవై నాలుగు అసత్య ప్రమాణాలు
* అబద్ధాలాడితే ఆడపిల్లలు పుడతారట
* అబ్బ నుయ్యి త్రవ్విస్తే అబ్బాయి పూడ్పించినట్లు
* అబ్బాయి ఆర్భాటం, ఆయాసమే గానీ కడుపు పండేది లేదు
* అబ్బలేని బిడ్డ - గట్టులేని చేను
* అబ్బురాన బిడ్డ పుట్టింది - గడ్డపలుగు తేరా చెవులు కుడదాం అన్నట్లు
* అభాగ్యునికి ఆకలెక్కువ - నిర్భాగ్యునికి నిద్రెక్కువ
* అభ్యాసం కూసు విద్య
* అభిరుచులా మస్తు - అంగస్తంభన నాస్తి
* అమరితే ఆడది - అమరకుంటే గాడిద

No comments:

Post a Comment