Saturday, June 15, 2019

అ - ఆ >>>> 9

* అతి తెలివి అరవై రకాలు
* అతిథి కోసమే తిథులు వున్నట్లు
* అదును లేని పైరు - ముదిమిలోని బిడ్డ ఒక్కటే
* అదుగో అంటే ఆరునెలలు
* అదుగో పులి అంటే యిదిగో తోక అన్నట్లు
* అదును గాని పదును
* అదును చూచి పొదలో చల్లినా పండుతుంది
* అదునెరిగి సేద్యం, పదునెరిగి పైరు వేయాలి
* అదుపుకురాని ఆలిని, అందిరాని చెప్పును విడవాలి
* అదుపులేని గుర్రాలు అగడ్తలు దాటుతాయా?
* అదృష్టం వుంటే పోయిందికూడా చేతికి వస్తుంది
* అదృష్టం చెప్పిరాదు - దురదృష్టం చెప్పిపోదు
* అదృష్టం పండితే ఆరు నూరవుతాయి
* అదృష్టవంతుడ్ని చెరిపేవారూ, దురదృష్టవంతుడ్ని బాగుచేసేవారూ లేరు
* అద్దం మీద అలిగి ముక్కు కోసుకున్నట్లు
* అద్దం మీద ఆవగింజ పడ్డట్టు
* అద్దంలో చూసుకుంటూ అందం అడిగినట్లు
* అద్దంలోని మూట అందిరాదు
* అద్దెకు వచ్చిన గుర్రాలు అగడ్తలు దాటుతాయా?
* అధమునికి భార్య అయ్యేదానికన్నా బలవంతునికి బానిసయ్యేది మేలు
* అధికారం ఆరుపాళ్ళు - అహంకారం అరవై పాళ్ళు
* అధికారం బంగారు గొలుసుల పంజరం
* అధికారాంతమునందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్‌
* అధికారి మూరెడు - బంటు బారెడు
* అధికాశ లోక దరిద్రం
* అనంతయ్య చేతిమాత్ర వైకుంఠయాత్ర అన్నట్లు
* అనగా అనగా రాగం - తినగా తినగా రోగం
* అని అనిపించుకోవలెనా అత్తగారూ!
* అనుకున్న పని అంగవస్త్రంలో అయినట్లు
* అనుభవం ఒకరిది - ఆర్భాటం, ఆయాసం ఇంకొకరివి
* అనుమానం ప్రాణ సంకటం / అనుమానం పెనుభూతం
* అనుమానం ముందుపుట్టి ఆడది తర్వాత పుట్టింది
* అనువు గాని చోట అధికుల మనరాదు
* అనువుగాని చోట పుండు - అల్లుడి వైద్యం

No comments:

Post a Comment