Sunday, July 14, 2019

మ >>>> 17

* మిద్దె ఉన్నవాడు బ్రతికి, గుడిసె ఉన్నవాడు చావడు.
* మిద్దె మీద పఱుగు, మీసాలమీద మెఱుగు.
* మినుములు తింటూ, అనుములు చేతిలో పెట్టినట్లు.
* మిన్ను కలిగినా, కన్ను కలిగినా కారక మానవు (కలుగు=ఎఱ్ఱనగు).
* మిన్నుపై బడినా మెలపుతో నఱచేతులొగ్గ జాలినవాడు.
* మిన్ను విఱిగి మీదపడితే అరచేతితో అడ్డగలమా?
* మిన్ను విఱిగి మీదపడ్డట్లు.
* మిరపకాయ చిన్నదని మేల మాడరాదు.
* మీఇంటి గేదె, మాఇంటి దూడ, తీసుకురా తిమ్మక్కా వీసెడు నెయ్యి.
* మీ ఇంట్లో తినివచ్చి మాఇంట్లో చేయి కడుక్కోమన్నట్లు.
* మీ ఊరు మా ఊరికెంత దూరమో, మా ఊరూ మీ ఊరికి అంతేదూరం.
* మీకు మాట, మాకు మూట.
* మీగడ మింగేవానికి వెన్న ఎట్లా వస్తుంది?
* మీగాలి మీద పడిన మెతుకు మిట్టి మిట్టి పడ్డట్లు.
* మీగాళ్ళు వాచినమ్మా! ంఈ ఇంట్లో ఓండ్లి ఎప్పుడూ? అంటే, మోకాళ్ళు వాచినమ్మా! మొన్ననే అయిపోయింది అన్నదట.
* మీ గొడ్డు కింత నున్న అంటే, మా బిడ్డ కింత వెన్న అన్నట్టు.
* మీద మిల మిల, లోన లొటలొట.
* మీద మెరుగులు, లోన పురుగులు.
* మీనమేషాలు లెక్క బెట్టినట్లు.
* మీను మ్రింగిన గ్రుక్కెడుతో మున్నీటికి కొరత ఏర్పడుతుందా?
* మీబిడ్ద కింత తవుడంటే, మీబిడ్డ కిన్ని పాలు అన్నట్లు.
* మీర లేని చుట్టం వస్తే, మిడకక తెల్లారదు.
* మీసం పస మగ మూతికి.
* మీసాల పసేగానీ, కోస నా బట్ట.
* మీసాలు వడదిరిగి ఉంటే, బుగ్గలు బటువుగా ఉంటవని నమ్మక మేమి?
* మీసాలెందుకు రాలేదురా? అంటే, మేనత్త (చాలు) చీలిక అని, గడ్డం వచ్చిందేమిరా? అంటే, అది మేనమామ పోలిక అన్నాడట.
* ముంజ ముదిరినా, లంజ ముదిరినా కొరగావు.
* ముంజలు తిన్నవానికంటే, మోరులు తిన్నవానికే తంటా.
* ముంజేతి కంకణానికి అద్ద మెందుకు?
* ముంజేతిలో సత్తువ ఉంటే, మణికట్టులతో వడ్లు మొదుగుతాయి.

No comments:

Post a Comment