Sunday, July 14, 2019

మ >>>> 18

* ముంజేయి ఆడితే, మోచేయి ఆడుతుంది.
* ముంజేయి మళ్ళితేనే మోచేయి మళ్ళేది.
* ముండకు దొరికేది మొరటు (మోటు) మొగుడే.
* ముండాకొడుకే కొడుకు, రాజు కొడుకే కొడుకు.
* ముండ చావనూ చావదు, ముట్టు తప్పనూ తప్పదు.
* ముండ పెంచిన కొడుకు - ముకుదారం (తాడు) లేని కోడె.
* ముండ ముప్పావుకు చెడ్డది, నరకుడు పావుకు చెడ్డాడు (నరకుడు=నరుడు).
* ముండ మొయ్యవచ్చును గానీ, నింద మొయ్యరాదు.
* ముండమోపి కాళ్ళకు మ్రొక్కితే, నీవూ నావలనే వర్థిల్లమని దీవించిందట.
* ముండమోపి కేల ముత్యాల పాపిట.
* ముండమోపి బలుపు - పాండురోగి తెలుపు.
* ముండాకొడుకు మూటికి జెడితే, ముండ నూటికి జెడుతుంది.
* ముండపై వలపుతో మోవి అనగానే జొల్లు, జుంటితేనె గాదు.
* ముండ్లమీద పడ్డ బట్ట మెల్లిగా తీసుకోవలె.
* ముండా కాదు ముత్తైదువా కాదు.
* ముంత మూతికట్టు, సంచి సభ కట్టు.
* ముంతెడు నీళ్ళకు ఉలిక్కి పడితే, బానెడు నీళ్ళు నీబావ పోసుకుంటాడా?
* ముంతెడు పాలకు ముత్యమంత చేమిరి (మజ్జిగ).
* ముందటివానికి ముంతం బలి, వెనకటివానికి తెడ్డెం బలి.
* ముందరికాళ్ళకు బంధాలు వేసి, ముండల తాళ్ళు తెంపినట్లు.
* ముందరికి వచ్చి కాలు విరుగపడ్డట్లు.
* ముందరేరు పోతే, ఆరేరే ముందరే రౌతుంది.
* ముందు అరకకు మొనగాళ్ళను కట్టవలె.
* ముందు ఆకు (విస్తర) వేయించుకుంటే, రరువాత ఎప్పుడైనా తినవచ్చు.
* ముందు(కుపోతే) గొయ్యి, వెనుక(కుపోతే) నుయ్యి.
* ముందుకుపోతే మురికిముండ, వెనుకకుపోతే వెఱ్ఱిముండ.
* ముందువచ్చే చండ్లను వెనుకకు నెట్టితే పోతవా?
* ముందు చచ్చింది ముత్తైదువ, వెనుక చచ్చింది విధవ.
* ముందు చూస్తే అయ్యవారి గుఱ్ఱంగా ఉంది. వెనుకచూస్తే సాహేబు గుఱ్ఱంగా ఉంది.
* ముందుచేసిన తప్పు మూలను ఉంటే, వెనుకచేసిన తప్పు మంచం కాడికి వచ్చినట్లు.

No comments:

Post a Comment