* టంకం పెట్టిన గుడిసె దెబ్బ కొడితే వడిసె.
* టంగుటూరు పెద్దమాలను తగవుతీర్చమంటే, తనకు ఇద్దరున్నారన్నాడట.
* టాటోటుగాడికి దధ్యన్నం, విశ్వాసపాత్రుడికి సద్దెన్నం.
* టెంకాయ చెట్టెందుకు ఎక్కినావురా అంటే దూడగడ్డి కన్నాడట, గడ్డి చెట్టుపైన ఉంటుందా? అంటే, లేదు కాబట్టే దిగివస్తున్నా అన్నాడుట కాయలదొంగ.
* టెంకాయ చెట్టుకు మడిగుడ్డ కట్టగానే దొంగ కడ్డమా?
* డంబము ఎప్పుడూ పూవులు పూయుచుండునే గానీ కాయలు కాయదు.
* డబ్బిచ్చి చెప్పుతో కొట్టించుకొన్నట్లు.
* డబ్బిచ్చి తేలు కుట్టించుకొన్నట్లు.
* డబ్బు ఇవ్వనివాడు పడవ ముందర ఎక్కును.
* డబ్బు ఉంటే, కొండమీద కోతికూడా దిగివస్తుంది.
* డబ్బుకు ప్రాణానికి లంకె.
* డబ్బుకు వచ్చిన చెయ్యే వరహాకు వస్తుంది.
* డబ్బు (దస్తు) దస్కం లేదుగానీ, దవాలు బంట్రోతు.
* డబ్బు పాపిష్టిది.
* డబ్బు ముడ్డిలో దేవుడున్నాడు.
* డబ్బురాని విద్య దరిద్రానికే.
* డబ్బు లేనివాడు డబ్బుకు కొరగాడు.
* డబ్బు లేనివానికి బోగముది తల్లివరుస.
* డబ్బు సభ కట్టును, ముద్ద నోరు కట్టును.
* డఱ్ఱుబుఱ్ఱు డాలుకత్తి, చూరులోన చురుకత్తి.
* డాగుపడిన పండు బాగులేదందురు.
* డాబుసరి బావా! అంటే డబ్బులేదు మరదలా అన్నాడట.
* డిందుపడినవాని నెందునూ లెక్కింపరు.
* డూడూ బసవన్నా అంటే తలూపినట్లు.
* డొంకలో దాగితే పిడుగుపాటు తప్పుతుందా?
* డొంకలో షరాబున్నాడు, నాణెము చూపుకోవచ్చును అన్నాడట దొంగలచేజిక్కిన వాడు.
* డౌలు దస్తు పెండ్లాము పస్తు (డౌలు=భూమి సిస్తు, దస్తు=వసూలు చేసిన పైకము ఖజానాకు చెల్లించుట).
* డౌలు చూపితే దరిద్రం పోతుందా? (డౌలు=డంభము, డాబు).
* ఢిల్లీకి ఢిల్లే, పల్లెకు పల్లే.
* ఢిల్లీపాచ్చా కూతురైనా పెండ్లికొడుకుకు లోకువే.
* ఢిల్లీకి పోయి ఉల్లిగడ్డ తెచ్చినట్లు.
* ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.

No comments:
Post a Comment