* జాణకు మూడుతావు లంటును.
* జాణలకు పురాణాగమశాస్త్రవేదజప ప్రసంగ త్రాణకల్గి ప్రయోజనమేమి?
* జాతికొద్దీ బుద్ధి, కులంకొద్దీ ఆచారం.
* జాతినాగుల చంపుతూ, ప్రతిమనాగులకు పాలుపోసినట్లు.
* జాబు వ్రాసిపెట్టమంటే, కాళ్ళు నొప్పులంటే, వాటితో పనేమంటే, నేను రాసింది నేనే చదవాలన్నాడట.
* జామాతా దశమగ్రహం.
* జారతోడి పొందు చావునకే యగు.
* జారితే పడమన్నారు, జరిగితే (సాగితే) పడమన్నారు.
* జింక కన్నీరు వేటగానికి ముద్దా?
* జింకకు కొమ్ములు బరువా?
* జిలిబిలి పలుకుల వెలది నకారగుళ్ళ పాలైనట్లు (నకారగుళ్ళు=నియోగులు).
* జిల్లేడు పూలకు తుమ్మెద లాశించినట్లు.
* జిల్లేళ్ళకు మల్లెలు పూయునా?
* జివ తక్కువ, జీత మెక్కువ.
* జిహ్వ కొక రుచి, పుఱ్ఱె కొక బుద్ధి.
* జిహ్వచేత నరులు చిక్కి నొచ్చిరిగదా.
* జీతంబెత్తం లేకుండా తోడేలు గొఱ్ఱెలను కాస్తానన్నదిట.
* జీతంలేని నౌకరు, కోపంలేని దొర.
* జీతగాడికి, నేతగాడికి చావులేదు.
* జీతగాడు అతగాడైనట్లు.
* జీలకఱ్ఱా సింగినాదం.
* జీలుగు (జీలగ) పెఱిగిన మాలెకు కంబము కాదు.
* జీలగ బెండ్లు చెవుల పెంచుతాయిగానీ కుండలాలిస్తాయా?
* జీవరత్నాన్ని ఇత్తడిలో పొదిగితే రత్నానికేమి లోటు?
* జీవితమొక వ్యాధి, నిద్రావస్థ ఉపశమనము, మరణమే ఆరోగ్యము.
* జుట్టుంటే ఎన్ని జడలైనా వెయ్యవచ్చు.
* జుట్టుకాలి ఏదుస్తుంటే, చుట్ట నిప్పడిగినట్లు.
* జుట్టు ఉన్న అమ్మ ఏకొప్పయినా పెట్టవచ్చు.
* జున్ను రుచి వెన్నకబ్బునా?
* జెముడుకు కాయలూ లేవు నిలువ నీడాలేదు.
* జెముడు కంచెకు శ్రేష్టం, రేగడ చేనికి శ్రేష్టం.
* జేనెడు ఇంట్లో మూరెడు కఱ్ఱ.
* జేనెడు దొరకు మూరెడు బంటు.
* జేనెడు పిట్టకు మూరెడు తోక.
* జ్యేష్ట చెడకురియును, మూల మురుగ కురియును.
* జైనవాని చేతి పేనువలె. (చంపడనుట).
* జొన్న పెరిగితే జాడు, వరిపెరిగితే వడ్లు.
* జోగీ జోగీ రాసుకుంటే, బూడిద రాలిందట.
* జోడులేని బ్రతుకు, త్రాడులేని బొంగరం.
* జోరీగల గొడ్డుకు గోరోజనం మెండు.
* జోలి పల్కులు తీసేలోగా బిక్షపు వేళ పోయిందట.

No comments:
Post a Comment