Sunday, July 14, 2019

మ >>>> 25

* మూడునాళ్ళ భాగవతానికి మూతిమీసాలు గొరిగించుకొన్నట్లు.
* మూడునాళ్ళ ముత్తైదువతనానికి ఆరుజోళ్ళ లక్కాకులు.
* మూడు నెలలు సాముచేసి, మూలనున్న ముసలిదాన్ని కొట్టినట్లు.
* మూడు పావులాల గుడ్డ, ముప్ఫై రూపాయల కుట్టు.
* మూడుపుట్ల చెవిటిదానికి ఆరుపుట్ల చెవిటివాడు ఆలోచన చెప్పినట్లు.
* మూడు బోనాలు సిద్ధమైనవి, దివ్వెకట్టె ముడికి వచ్చినది, దొరగారు సువారునకు రావచ్చును (సువారము= కోటలో కొలువు).
* మూడు మనువులు వెళ్ళినా, పొయ్యి ఊదమన్నారు.
* మూడు మాటలలో ఆరు తప్పులు.
* మూడు మారులు తప్పిన, ఏడు దూరాలు.
* మూడు మూరా ఒకచుట్టే, ముప్ఫైమూరా ఒకచుట్టే.
* మూడు మూసి ఆరు అతికినట్లు.
* మూడువందలు పెట్టి గేదెను కొని, మూడణాలు పెట్టి తాడు కొనలేనట్లు.
* మూడో తరగతిలో ఎందుకు ప్రయాణం చేసావంటే, నాల్గో తరగతి లేదు కాబట్టి అన్నాడట.
* మూడో పెండ్లివాడికి ముహూర్తం కావలెనా?
* మూతి పెట్టినవాడు మేత పెట్టడా?
* మూతి ముద్దుల కేడిస్తే, వీపు గుద్దుల కేడ్చిందట.
* మూతులు నాకేవాడికి మీసాలెత్తే వాడొకడా?
* మూరెడు ఇంట్లో బాఱెడు కఱ్ఱ, ఎట్లా కొడతావో కొట్టరా మొగుడా.
* మూరెడు పొంగటం ఎందుకు? బారెడు కుంగటం ఎందుకు?
* మూరె డేక్కే దెందుకు? బారెడు కుంగే(దిగే)దెందుకు?
* మూరెడు ముందుకు పోనేల? బారెడు వెనక్కు రానేల?
* మూర్ఖచిత్తుడు కోపమునకు పెద్ద.
* మూర్ఖు డెపుడు గోరు ముదితలతో పొందు.
* మూర్ఖునకును బుద్ధి ముందుగానే పుట్టు.
* మూర్తి కొంచమైనా, కీర్తి దొడ్డది (పెద్దది).
* మూల ఉండే వాళ్ళను ముంగిట్లోకి లాగినట్లు.
* మూలాకార్తెకు వరి మూల చేరుతుంది.
* మూలాకార్తెలో కురిస్తే, ముంగారు పాడు.
* మూల ముంచును, జ్యేష్ట చెరచును (కురిసి).
* మూలలో చల్లిన ఉలవలు మూడు పువ్వులు ఆరు కాయలు.

No comments:

Post a Comment