Sunday, July 14, 2019

మ >>>> 26

* మూలవాన ముంచక తీరదు.
* మూలవిగ్రహాలు ముష్టి ఎత్తుకుంటూ ఉంటే, ఉత్సవ విగ్రహాలకు దధ్యోదనమట.
* మూలవిరాట్టు తిరిపమెత్తుకుంతుంటే, (మొత్తుకుంటుంటే) ఉత్సవ విగ్రహాలకు తెప్పతిరునాళ్ళట.
* మూలిగిన మూతికేసి రాస్తారు.
* మూలిగే నక్కమీద తాటిపండు పడినట్లు.
* మూలుగులు మునుపటిలాగే, భోజనాలు మాత్రం ఎప్పటిలాగే.
* మూసిచూడను కాసులేదు, ముండను చూస్తే ముద్దొస్తుంది.
* మూసిన ముత్యం, మాయని పగడం.
* మూసిన ముత్యము, పాసిన పగడము.
* మూసిన వాయనం ముత్తైదువవలె.
* మూసిపెట్టితే పాచిపోయిందట.
* మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును.
* మృగశిర కురిస్తే ముసలిఎద్దు ఱంకె వేయును.
* మృగశిరతో గూడా ముల్లోకాలు చల్లబడును.
* మృగశిర బిందిస్తే ఇరుకార్తెలు ఎలుగిస్తవి.
* మృగశిరలో బెట్టిన పైరు, మీసకట్టున బుట్టిన కొడుకు మేలు.
* మృగశిర వర్షిస్తే, మఖ(ఘ) గర్జిస్తుంది.
* మృగశిర కురిస్తే, ముంగాలి(రు) పండును.
* మృతి దగ్గరకు వచ్చినా, సతి దగ్గరకు వచ్చినా మతి ఉండదు.
* మృత్యువు పంచాంగం చూచి పనిచేయదు.
* మృదు శబ్దానికి మధుశబ్దానికి భేదమేమిరా? అంటే, వట్లల్లో సుడి (వట్రుసుడి) అన్నాడట.
* మెచ్చి మేకతోలు, కోరి గొఱ్ఱెతోలు కప్పుతారు.
* మెట్ట దున్నినవాడు, లొట్టె త్రాగినవాడు ఒకటే.
* మెట్ట నున్నా ఏనుగే, పల్లాన ఉన్నా ఏనుగే.
* మెట్టను మాత, పల్లాన భార్య.
* మెట్టరైతు లొట్టెపిట్ట.
* మెట్టినిండ్లనుండి కాన్పుకు పుట్టినిండ్లు చేరినట్లు.
* పెట్ల చప్పుడే గానీ, దోవ జరుగదు.
* మెడ తడవటం పూసల కొఱకే.
* మెడనూతు(కు)ల వారింట్లో పిడిగుద్దుల సమారాధన.

No comments:

Post a Comment