Sunday, July 14, 2019

మ >>>> 28

* మేకలు తప్పించుకొంటే తుమ్మలు, మాలలు తప్పించుకొంటే ఈదులు (ఈదులు= ఈతచెట్ల తోపులు).
* మేకలే మడకలు దున్నితే, ఎద్దులు ఎవరికి కావాల?
* మేకవన్నె పులి.
* మేకశిరం మెత్తగా ఉన్నదని మఱికాస్త లాగాడట.
* మేఘాలు నలుపైతే వాననీళ్ళు నలుపగునా?
* మేడలు గుడిసెలు కావడం కన్నా, గుడిసెలు మేడలు కావడం మేలు.
* మేడిపండు జూడ మేలిమైయుండును పొట్టవిచ్చి చూడ పురుగులుండు.
* మేడసిరి కీడు చేయదు (మేడసిరి = అత్తిబాగా కాలి పేలుట).
* మేతకన్నా మసలితేనే బలం.
* మేతకరణమే గానీ కూతకరణం గాదు.
* మేతకేగాని చేతకు (కూతకు) కొరగాడు.
* మేదరసాల దుర్గంమీద మేకకాలంత మొయిలువేస్తే, తుల్లూరు దొందపాడు కాయ దూడకట్టు అయినా కాదు.
* మేనత్తపోలిక, మేనమామ చీ(చా)లిక.
* మేనత్త మూతికి మీసాలు ఉంటే చిన్నాయన అవుతాడు.
* మేనమామకైతే ఇవ్వడు, పోలుబొందలలో పెడతాడు.
* మేపే రూపు.
* మేమే అంటే మెడలెక్కి కూర్చున్నాడట.
* మేయబోతే ఎద్దుల్లోకి, దున్నబోతే దూడల్లోకి.
* మేయబోయి మెడకు తగిలించుకొన్నట్లు.
* మేలుమేలంటే, మెడ విరగబడ్డట్లు.
* మేలోర్చలేని అబ్బకుతోడు మూగతల్లి దొరికినట్లు.
* మేసేగాడిదను కూసేగాడిద (వచ్చి) చెఱచిందట.
* మేసేజన్మలు మేతలు మానినవి, పలుకులు మానండఱ్ఱా పంజరాల చిలుకల్లారా అన్నట్లు.
* మేస్త్రీలు మేడకట్టితే, కుక్కకాలు తగిలి కూలిపోయిందట.
* మేహజాడ్యం, తోట సేద్యం.
* మైనపుగోడలను గురించి కంచుగోడలు కాలిపోయినవట.
* మైనపు ముక్కువాడు (ఏవైపంటే ఆవైపుకు తిరుగుతాడు).
* మొండి ఈతకు (యీనితే) మోపుడు జూక లన్నట్లు.
* మొండికి తగ్గ మిండడు.
* మొండికి సిగ్గులేదు, మొరడకు (మొరటుకు) గాలిలేదు.

No comments:

Post a Comment