Sunday, July 14, 2019

మ >>>> 27

* మెడపూసలకు సమ్మసరిపోయిన బొమ్మలాట ఆడినట్లు.
* మెడబట్టి నెట్టితే చూరుబట్టుకొని వ్రేళ్ళాడినట్లు.
* మెడలో రుద్రాక్షలు, మదిలో మదిరాక్షులు.
* మెతుకుపోతే బ్రతుకుపోతుంది.
* మెతుకులు చల్లితే కాకులకు కొదువా?
* మెత్తగా ఉంటే మొత్త బుద్ధివేస్తుంది.
* మెత్తటి పులి, సాదు పలవ.
* మెత్తటి పులి ధర్మ సూతి.
* మెత్తనాళ్లు పోయినవి, చెత్తనాళ్ళు వచ్చినవి.
* మెత్తని చోటనే గుద్దలి వాడి.
* మెత్తని మట్టిని మోచేతితో త్రవ్వినట్లు.
* మెత్తనిమాట లాడరా అంటే, దూది వెన్నపూస అన్నాడట.
* మెత్తనివాడిని చూస్తే మొత్త బుద్ధివేసినట్లు.
* మెత్తలు ఎందకువేస్తే, మెడల నొప్పులు పోతాయా?
* మెఱుగు వేయనిదే మృదువు రాదు (మెఱుగు=చమురు, నెయ్యి).
* మెఱుగు వేయనిదే మెఱుగు రాదు.
* మెఱుపుకొద్దీ వర్షము.
* మెఱుపు దీపంగాదు, మబ్బు గొడుగు కాదు.
* మేక ఆకులు మేయగానే ఉపవాస మగునా?
* మేకకు ఙ్ఞాపకముండేది మేత ప్రసంగమే (సంగతే).
* మేకకు తెలిసిందంతా మేత సంగతే
* మేకకు మెడచన్నులు, తాళ్ళకు (తాడిచెట్లకు) తలచన్నులు.
* మేకపిల్లను చంకలో బెట్టుకొని ఊరంతా వెదకినట్లు.
* మేక పెంటిక ఎక్కడున్నా ఇక్కటే.
* మేక(పో)బోతు గాంభీర్యం - మాచకొమ్మ సౌందర్యం.
* మేక మెడచన్ను కుడిస్తే ఆకలితిరునా?
* మేక మెడచన్నులకు పాలు, మేడికి పూలు లేవు.
* మేక మెడచన్నులు పిసుకను పిండను పనికిరావు.
* మేక మెడచన్నులు (నిష్ప్రయోజనములు అనుట - అజాగళస్తనాలు).
* మేక మేయని ఆకు ఏదంటే - బండి ఆకు, రాట్నపు ఆకు.

No comments:

Post a Comment