Sunday, July 14, 2019

మ >>>> 2

* మంచిగా ఉంటే నేను చేశాననుకో, మంచిగాలేకుంటే మావాడు చేశాడనుకో.
* మంచిగొడ్డు కొక దెబ్బ, మంచి మనిషి కొక మాట.
* మంచిచెడ్డలు దేవును కుడి ఎడమ చేతులు.
* మంచిచెడ్డలు పడుగు పేకలు.
* మంచి చేసిన ముంగికి ముప్పు వచ్చినట్లు.
* మంచి దున్నపోతయినా మందకొడి ఎద్దుకు సరిరాదు.
* మంచినోరు చేదు మింగినట్లు.
* మంచి పెంపు, చెడ్ద లోతు అన్ని దేశాలలో అన్ని జాతులలో సమానం.
* మంచి ప్రాణానికి మండలం వఱకు భయం లేదు (మండలం=40 దినాలు).
* మంచి మంగలైనా, ఎగ గొరిగితే మంటే.
* మంచి మంచి ముహూర్తాలు మీఇంట్లోనూనా? మాచకమ్మ సమర్తలు మాఇంట్లోనూనా?
* మంచి మంచి వారంతా మడుగులో మునిగితే, కోణంగిదాసరి కోనేటిలో మునిగెనట.
* మంచిమాటకు మంది అంతా మనవాళ్ళే.
* మంచివాడు మంచివాడంటే, మంచమంతా ఏరిగి పెట్టినాడట.
* మంచివాడు మంచివాడంటే, మంచమంతా కంతలు చేసినాడట.
* మంచివాడు మంచివాడంటే, మంచమెక్కి గంతులు వేశాడట.
* మంచివాడు మంచివాడంటే, మదురెక్కి ఉచ్చ పొశాడట.
* మంచివాడైనందుకు మరణమే శిక్ష.
* మంచివాని కొకమాట, మొరకు కొక వ్రే(ఏ)టు.
* మంచివాని చావు మరణంలో తెలుస్తుంది.
* మంచివాని గుణం మాంసం దగ్గఱ, సత్యవంతుడి గుణం చావు దగ్గఱ తెలుస్తుంది.
* మంచివానికి మాటే మందు.
* మంచివాని దగ్గఱకు మంచివారిని పంపినారు, నీదగ్గరకు నన్ను పంపినారు.
* మంచు కుంచాల కొలిచినట్లు.
* మంచుకు పెట్టిన పందిళ్ళు ముసారాకు అగునా?
* మంచుకు వేసిన పందిళ్ళు వాన కాగునా?
* మంజులాలాపము లేని కావ్యము, విలాసములేని వధూటి.
* మంటి ఎద్దయినా మా ఎద్దే గెలవాలి.
* మంటిదేవునికి మజ్జనమే సాక్షి.
* మంటిపనికైనా ఇంతివాడే వెళ్ళాలి.

No comments:

Post a Comment