Sunday, July 14, 2019

మ >>>> 3

* మంటిలో మానెడు, ఇంటిలో పుట్టెడు.
* మంత్రం చెప్పను మల్లుభట్లు, తినేదానికి తిప్పంభట్లు.
* మంత్రం లేని తీర్థం మరి బుక్కెడు.
* మంత్రం లేని సంధ్యకు మరి చెంబెడు నీళ్ళు.
* మంత్రంలో పసలేకపోయినా తుంపర్లకు తక్కువ లేదు.
* మంత్రజలము కంటే మంగలి జల మెచ్చు.
* మంత్రసాని తనానికి ఒప్పుకున్న తర్వాత ఏది వచ్చినా పట్టాలి.
* మంత్రసాని దెప్పులు, అత్తగారి సాధింపులు.
* మంత్రసాని పనికి ఒప్పుకున్నప్పుడు, బిడ్డ వచ్చినా పట్టాల, పియ్య వచ్చినా పట్టాల.
* మంత్రసాని ముందట మర్మం దాచినట్లు.
* మంత్రాలబువ్వ కడుపులోనికిపోతే యంత్రాలు చేయిస్తుంది, యంత్రాలున్న బువ్వ కడుపులోనికి పోతే తంత్రాలు చేయిస్తుంది.
* మంత్రాలకు మామిడికాయలు రాలుతాయా?
* మంత్రాలు తక్కువ, తుంపరు లెక్కువ.
* మందగుది ఎద్దు నడక, నత్తిమాటలు - మొదటసాగవు.
* మందబలం చూచి కుక్క మొరుగుతుంది.
* మందలింపు బెడిస్తే ముప్పు.
* మందికి చెప్పానుగానీ మనకు చెప్పానా?
* మందిని ముంచి మసీదు కట్టినట్లు.
* మంది పలుచనైతే, గంజి చిక్కన అవుతుంది.
* మంది మాటవిని మనువుపోతే, మళ్ళీ వచ్చేసరికి ఇల్లు గుల్ల అయ్యింది.
* మంది యెక్కువయితే (మోపయితే) మజ్జిగ పలుచన.
* మంది యెక్కువయితే 9లావయితే) మఠానికి చేటు.
* మందు పథ్యం, మాటకు సత్యం.
* మందుకు పోయినవాడు మాసికానికి వచ్చినట్లు.
* మందుగానీ మాకు లేదు గానీ కూర్చువా డొక్కడే కొదువ.
* మందుమాకిడి గండమాల మాంపగలేడు చక్కచేయగలడే నక్కమొర (గండమాల=మెడచుట్టు మేహగ్రంధులు లేచు వ్యాధి).
* మందూ లేదు గుండూ లేదు, తుపాకీ పట్టుక కాల్చమన్నట్లు.
* మందైనా కావాలి, ముండైనా కావాలి.
* మకరందపానంబు మధుకరాలికిగాక జోరీగలు జుఱ్ఱగలవా?
* మకురాంకు కేళికోర్చిన ముకురానన మల్లయుద్ధమున కెట్లు ఓపు.

No comments:

Post a Comment