* ప్రసుతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ఆభావ వైరాగ్యం.
* ప్రాక్టీసు లేని ప్లీడరు దేశాభిమాని అయినట్లు.
* ప్రాణముంటే ఉప్పుగల్లమ్ముకొని బ్రతుకవచ్చు.
* ప్రాణముంటే బలుసాకు తిని బ్రతుకవచ్చు.
* ప్రాణముండే వరకు భయం లేదు.
* ప్రాణం పోయినా మానం దక్కించుకోవలె.
* ప్రాణం పోయేటప్పుడు కూడా త్రాచు పడగ దించదు.
* ప్రాణం మీదకి వచ్చినప్పుడు పంచాంగం చూచి మందు పోస్తారా? (త్రాగిస్తారా?)
* ప్రాణమున్నప్పుడే పంతాలు నెరవేరుతాయి.
* ప్రాణములేనివానికి బంగారు తలపాగాజుట్టిన ప్రయోజనమేమి? అణివజ్ర భూషణ మురమున బెట్టనేమి?
* ప్రాతదొంగ పట్టుబడక పోడు.
* ప్రాతబడ్డ బావినీరు, మేకలపాడి రోత (బొచ్చుపడునని, మేకను వెనుక గుండ పితుకుటచే పెంటికలు పడునని రోత).
* ప్రాయము వస్తే పందిపిల్లకూడా బాగుంటుంది.
* ప్రాయాన బెట్టిన పంట - ప్రాయాన గన్న కొడుకు.
* ప్రాసకేడ్చానే కూసుముండా (పాసుముండా) అన్నట్లు.
* ప్రియం మహాలక్ష్మి, చౌక శనేశ్వరం.
* ప్రియములేని కూడు పిండపు కూడురా.
* ప్రీతితో పెట్టింది పిడికెడైనా చాలు.
* ప్రీతిలేని కూడు పిండాకూడు.
* ప్రీతిలేని లంజ ఘాతకియై తోచు
* ప్రేమ అమ్మేది కాదు కొనేది కాదు, ప్రేమ వెల ప్రేమే.
* ప్రేమ గుడ్డిది.
* ప్రేమలేని మాట పెదవిపైనే ఉండును.
* ప్రోలులోనే లేకపోతే, పొడుగునా ఉంటుందా?
* ఫకీరువాణ్ణి తెచ్చి పరుపులో కూర్చుండ బెడితే, లేచి లేచి మసీదులోనికి పోయాడట.
* ఫణివాత బడని ప్రభంజనమా?
* ఫరవాలేని చుట్టం వచ్చింది, పాతచేత గొడుగు పట్టమన్నట్లు.
* ఫలానికి తగిన బీజం.
* ఫాల్గుణమాసపు వాన పదిపనులకు చెఱుపు.

No comments:
Post a Comment