Sunday, July 14, 2019

ప - ఫ >>>> 37

* పోరు నష్టం, పొందు లాభం.
* పోరులేని గంజి పు(రి)డిసెడైనా చాలు.
* పొలనాటిలో పోకకు పుట్టెడు అమ్మితే, ఆ పోకా దొరకక పొర్లి పొర్లి ఏడ్చిందట.
* పోలికి వచ్చిన భోగానికి, పొట్టేలుకు వచ్చిన రోగానికి తిరుగులేదు.
* పోలీ, పోలీ, నీ భోగమెన్నాళ్ళే? అంటే, మా అత్త మాలపల్లి నించి (మాలాడ) వచ్చేదాకా అన్నదిట.
* పోలుగాడి చెయ్యి బొక్కలో పడ్డట్టు.
* పోలేరమ్మకు పోయేది లేదు, పోతురాజుకు వచ్చేదీ లేదు.
* పోలేరమ్మ దిగివచ్చితే పొలంకాపు కేమిభయం?
* పోలేరమ్మది చినగదు, పోతురాజుది విరుగదు.
* పోలేరమ్మ పెండ్లిలో పోతురాజు పెత్తనం.
* పౌరుషం (పురుషకారం) లేక దైవం అనుకూలించదు.
* పౌరుషానికి (సనికలు) పొత్రం మెడకు కట్టుకున్నట్టు.
* పౌర్ణమికి పూజించి, అమావాశ్యకు ఆరగిస్తవి (తేనెటీగలు తేనెతుట్టెను).
* ప్రజల మాటే ప్రభువు కోట.
* ప్రఙ్ఞలేని శౌర్యం - పదునులేని ఖడ్గం.
* ప్రతిష్ఠకు పెద్దనాయడు చస్తే, ఈడవలేక ఇంటిల్లిపాదీ చచ్చారట.
* ప్రథమ కబళంలోనే మక్షికాపాతం.
* ప్రథమ చుంబనం - దంత భగ్నం. (మొదటి ముద్దుకే మూతిపండ్లు రాలినవి).
* ప్రదక్షిణలు చేస్తే, బిడ్డలు పుడుతారంటే, చుట్టు చుట్టుకూ కడుపు చూసుకున్నదట.
* ప్రపంచమంతా ధర్మపరాయణమైతే శౌర్యానికి తావుండదు.
* ప్రభగిరిపట్నం తాడిచెట్టు వలె (పొడుగు).
* ప్రయాణాల వారి హడావుడికంటే, పెట్టెలు మోసేవారి హడావుడి ఎక్కువ.
* ప్రయాణాలు అబద్ధం, ప్రసాదాలు నిబద్ధం.
* ప్రసాదానికి బలిష్టం, పనికి మీ అదృష్టం.
* ప్రసాదానికి ముందు, పనికి వెనుక.
* ప్రసూతి వైరాగ్యం ఒంటిపచ్చి ఆరేవరకే.

No comments:

Post a Comment