Sunday, July 14, 2019

ల >>>> 4

* లొట్టిపిట్ట శూల రోకళ్ళతోగానీ పోదు.
* లొల్లిలో మల్లిగాని పెండ్లి.
* లోకము మూయను మూకుడున్నదే.
* లోకాన్ని (లోకపునోరు) మూయను మూకుడున్నదా?
* లోకులు కాకులు.
* లోకులు పలు(ల)గాకులు (పలుగాకి=పోకిరి).
* లోకులెల్ల వెఱ్ఱిపోకిళ్ళు బోదురు.
* లోకువదానికి నూకల జావ.
* లోగుట్టు పెరుమాళ్ళ కెరుక.
* లోన వికారం, బయట శృంగారం.
* లోపల ఊబి, పైన పూరికమ్మిన పాడునూయి.
* లోపల కంపు, వెలుపల సొంపు.
* లోపల లొటలొట, మీద (బయట) మిటమిట.
* లోభికి ధర్మచింత, వెఱ్ఱివానికి వివేకము దూరము.
* లోభికి నాలుగందాల నష్టము.
* లోభికి మూట నష్టి.
* లోభి గడన సుంకరులకు వర్నసంకరులకు.
* లోభి బీదకంటే బీడు.
* లోభి సొమ్ము లోకుల పాలు.
* లోలోపల లొట్టి, నామొగుడు విన్న కొట్టి.
* లోవి మూయవచ్చును గానీ లోకమునోరు మూయలేరు (లోవి=అన్నమువండు వెడల్పు మూతిగల మట్టికుండ).

No comments:

Post a Comment