* రోటి పాట రోకటి పాట (మార్పు లేని వనుట).
* రోటిలో తలదూర్చి, రోకటిపోటుకు వెఱచినట్లు.
* రోతలకు రోత ముదిమి.
* రోలు కఱ వెఱుగదు.
* రోలుకు ఒకవైపు, మద్దెల కిరువైపుల దెబ్బలు.
* రోలు పగిలినా లిద్దె బాగా బిగిసినది అన్నట్లు.
* రోలుపోయి మద్దెలతో మొర పెట్టుకొన్నట్లు.
* రోళ్ళు పాడినట్లా? రోకళ్ళు పాడినట్లా?
* రోసంలేని బంటుకు మోసం లేదు.
* రోసంలేని మూతికి మీసం ఎందుకు?
* రోసాన సాయబు రొట్టెన్నర తిన్నాడట.
* రోసి వేసినది రాశికి వచ్చింది.
* రోసానికి పోయిన రొండ్లెగుసవు.
* రోషానికి రోలు మెడను కట్టుకొన్నట్లు.
* రోహిణి ఎండకు రోళ్ళు పగులును.
* రోహిణికార్తెలో విత్తుట రోటిలో విత్తుటే.
* రోహిణికార్తెలో విత్తులు రోయక వేస్తారు, మృగశిరలో ముంచి పోస్తారు.
* రోహిణిలో జొన్నలు - సాహిణిలో గుఱ్ఱాలు.
* రోహిణిలో రోకళ్ళు చిగిర్చనన్నా చిగిరిస్తవి, రోళ్ళు పగులనన్నా పగులుతవి.
* రోహిణిలో విత్తనం, రోళ్ళూ నిండని పంట.
* రౌతు కొద్ది గుఱ్ఱము.
* రౌతు దిగాలంటున్నాడు, గుఱ్ఱం ఎగరవేయా (పడదోయాల) అంటున్నది.
* రౌతు మెత్తనైతే గుఱ్ఱం మూడుకాళ్ళతో నడుస్తుంది.
* ఱంకాడ నేర్చినమ్మ బొంకాడ నేర్వదా?
* ఱంకు చదువు చదివి ఱంకున జెడుదురు.
* ఱంకుటాలికి క్రొత్తడి సుద్దులు పెచ్చు.
* ఱంకుటాలి చన్నుకు, సంత సొరకాయకు వచ్చేపోయ్యే వాళ్ళ గోటిగాట్లు తప్పవు.
* ఱంకుతనం ఇల్లెక్కి కూత వేస్తుంది.
* ఱంకుమగడు కడుపునొప్పి ఎఱుగడు.
* ఱంకుముండ బజారు రచ్చకు వెరచునా? వీరపతివ్రత వెరచు గానీ.
* ఱంకుమగడు వీపుమన్ను దులిపిపోవునా?
* ఱంకులసాని రాగంతీస్తే, రల్లిబండ రాతిలింగం కడకు నడుస్తుంది.
* ఱంకు సాగితే పెళ్ళెందుకు?
* ఱంపాన కోసి రాచినకొలది గంధపు చెక్కకు వాసన ఎక్కువ.
* ఱాతిలో నార తీసినట్లు.
* ఱాతికంటే గట్టి రాయలసీమ కోడి.
* ఱాతి టెంకాయ వలె.
* ఱారిబొమ్మకు చక్కిలిగింతలా? (గిలిగింతలా?)
* ఱాయి గుద్దనేల? చెయ్యి నొవ్వనేల?
* ఱాయివోలె ఉంటే రాసికొందుము, పువ్వువోలె ఉంటే పూసికొందుము.
* ఱాల (కొట్టిన) రువ్విన వానిని పూల దువ్వుతారా?
* ఱాళ్ళు తిని ఇళ్ళు ఆరగించుకుంటారు.
* ఱెక్క ఆడితేగానీ డొక్క ఆడదు.
* ఱెక్కల కష్టం, బొక్కల పులుసు.
* ఱెక్కలు పెరికిన పెట్ట (కోడి)వలె. (ఈకలుపెరికిన కోడి వలె).
* ఱెక్కలు విఱిగిన పక్షి వలె.
* ఱెప్పలతో దీపాలు ఆర్పినట్లు.

No comments:
Post a Comment