* ఏ అన్నమైతే ఏం? వరి అన్నమే వడ్డించమన్నాడుట.
* ఏ ఆకు రాలినా ఈతాకు రాలదు.
* ఏవూరు ఏతామా? అంటే దూవూరే దూలామా అన్నదిట.
* ఏవూరు రెడ్డీ అంటే ఏట్లో మోకాలిలోతు అన్నాడట.
* ఏ ఎండకా గొడుగు పట్టినట్లు.
* ఏకచక్రంగా ఏలిన రాజైనా కడకు ఏడు జానల కాటికే.
* ఏకదంతుండిచ్చు నీకింత బొచ్చు.
* ఏ కఱ్ఱన నిప్పుంటే ఆ కఱ్ఱే కాలుతుంది.
* ఏకాదశి ఇంటికి శివరాత్రి పోయినట్లు.
* ఏకాదశినాడు తల అంటుకుంటున్నావేమీటీ అంటే అది నిత్యవ్రతం, నేడే ఆరంభించాను అన్నాడట; మర్నాడు తల ఎందుకు అంతుకోలేదంటే, నిన్నటితో వ్రతం సమాప్తి అయినది అన్నాడుట.
* ఏకాదశినాడు పేలపిండి తినకపోతే రాక్షసులై పుడతారు.
* ఏకాదశి మరణమని ఈతకొయ్యలలో పడతానా?
* ఏకాల వచ్చి, మేకాల తేలినట్లు.
* ఏకాలు జారినా పిఱ్ఱకే మోసం.
* ఏకాలు జారినా మోపుకే మోసం.
* ఏకుతో తాకితే మోకుతో మోదుతారు.
* ఏకు దారము, ఏగాని పుస్తె.
* ఏకులు పెడితే బుట్టలు చిరుగునా?
* ఏకులు లేని రాటము, మొగుడులేని పోరాటము.
* ఏకులు వడికినట్టూ కాదు, మొగుడి దగ్గర తొంగునట్టూ కాదు.
* ఏకైకరధులు ప్రత్యేక పాలెగాండ్రు.
* ఏగాని ముండకు డబ్బున్నర క్షౌరం.
* ఏగాలి కాఊపు ఊగినట్లు.
* ఏగాలి కాచాప ఎత్తినట్లు (పడవ తెరచాప).
* ఏగిలి (దుక్కి బాగా ఎండుట) చేస్తే ఏలనివానికైనా పండుతుంది.
* ఏగిలి దున్నితే, వెఱ్ఱిమాలకైనా పండుతుంది.
* ఏ గుంటలో నీరు ఆ గుంటలోనే ఇంకుతుంది.
* ఏ గుఱ్ఱానికి తోక ఉంటే, ఆ గుఱ్ఱమే ఊపుకుంటుంది.
* ఏ గూటి చిలుకకు ఆ గూటి పలుకు.
* ఏ గూటి పక్షి ఆ గూటికే చేరును.
* ఏ గ్రహము పట్టినా ఆగ్రహము పట్తరాదు.
* ఏ చంకనాకినా ఏమీ లేదుగానీ, ఏకు చంకనాకితే ఏగాని ఉంది.

No comments:
Post a Comment