Saturday, June 15, 2019

ఎ -ఏ >>>> 9

* ఎల్లినదానికి ఏగాని తార్చినదానికి టంకం.
* ఎల్లిని మల్లి చేయి, మల్లిని ఎల్లి చేయు.
* ఎల్లి మీద పుల్లి, పుల్లి మిద ఎల్లి
* ఎల్లిసెట్టి లెక్క ఏకలెక్క.
* ఎవడబ్బ సొమ్మని వెక్కి వెక్కి ఏడవటం.
* ఎవడికంపు వాడికి ఇంపు.
* ఎవడి జందెం వాడికి ముప్పు.
* ఎవడి నోటికంపు వాడికి తెలియదు.
* ఎవడు తవ్వుకొన్న గోతిలో వాడే పడతాడు.
* ఎవరి ఇంటి దోసెకైనా తూట్లే.
* ఎవరి ఏడుపు వాళ్ళకే ఎదురు తగులుతుంది.
* ఎవరి కంతికోస్తే వారికే నొప్పి.
* ఎవరి పిచ్చి వారికి ఆనందం.
* ఎవరికి పుట్టిన బిడ్దవురా ఎక్కి ఎక్కి ఏడ్చేవు?
* ఎవరికి పెట్టావే దండము? అంటే మీలో బుద్దిహీనుడికి అన్నదిట సాని.
* ఎవరికి వారే యమునా తీరే.
* ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డని ఎగిరెగిరి ముద్దుపెట్టుకున్నట్లు.
* ఎవరి జానతో వారు ఏడు జానల బెత్తెడే (పొడవు).
* ఎవరి నీళ్ళలో వారు మునగాలి.
* ఎవరి పాపాన వాళ్ళు పోతారు.
* ఎవరిపిచ్చి వాళ్లకు ఆనందం
* ఎవరి ప్రాణం వాళ్ళకు తీపి.
* ఎవరి బిడ్డ వారికి ముద్దు.
* ఎవరి ముడ్డికిందికి నీళ్ళు వస్తే వాళ్ళే చేస్తారు.
* ఎవరివల్ల చెడ్డవోయి వీరన్నా అంటే నోటివల్ల చెడ్డానోయి పేరన్నా అన్నాడుట.
* ఎవరు ఇచ్చింది ఈ మాన్యం అంటే, నేనే ఇచ్చుకున్నాను అన్నాడట.
* ఎవరు ఎంతచేసినా ఇంటికి ఆలు అవుతుందా? దొంతికి కడవ అవుతుందా?
* ఎసటిలో మెతుకులన్ని పట్టిచూడాలా?

No comments:

Post a Comment