Saturday, June 15, 2019

ఎ -ఏ >>>> 11

* ఏ చెట్టులేని చోట వెంపలి చెట్టు (ఆముదపు చెట్టు) మహావృక్షం.
* ఏటికవతల ఇచ్చేకన్నా ఏట్లో పడేస్తే నయం.
* ఏటి అవుతలు మిరియాలు మా తాటికాయంతేసి అంటే, మా ఇడుమాకులే పట్టలేదన్నదిట. (ఇడుమాకులు= ఇంటి ముందరి ప్రాంగణము).
* ఏటి ఈతకు బీటి మేతకు సరి.
* ఏటి ఒడ్డు చేను ఏరు వస్తే నిలుస్తుందా?
* ఏటి కాడ నక్కకు పాటి రేవేమి తెలుసు.
* ఏటికి ఎప్పుడు పోయినావు? ఇసుక తెచ్చావు? అంటే ఆడవారు తలిస్తే అదెంత సేపు అన్నదిట; మొగవారు తలిస్తే ఇదెంతసేపు అని నాలుగు బాదినాడుట.
* ఏటి కాల్వ జూడ ఎక్కి తగ్గిన రీతి.
* ఏటికి ఎదురీదినట్లు.
* ఏటికి ఎన్ని నీళ్ళూ వచ్చినా, కుక్కకు గతుకు నీళ్ళే.
* ఏటికి పోయి జారిపడి ఊరు అచ్చిరాలేదన్నాడుట.
* ఏటికి లాగితే కోటికి, కోటికి లాగితే ఏటికి అన్నట్లు.
* ఏటి కట్టున కూటి గట్టున ఓపిక పట్టలేరు.
* ఏటిదరి మ్రానుకు ఎప్పుడూ గండమే.
* ఏటిమీద దేవరకు కూటిమీదే చింత.
* ఏటివంక లెవరు తీస్తారు, కుక్కతోక ఎవరు సరిచేస్తారు?
* ఏటి వరద, నోటి దురద.
* ఏటుకు ఏటు, మాటకు మాట.
* ఏట్లో కలిసిన చింతపండు లాగా.
* ఏట్లో పడ్డవానికి ఎన్నో ఎన్నికలు.
* ఏట్లో పారేనీరు ఎవరు తాగితేనేమీ?
* ఏట్లో వేసినా ఎంచి వేయవలెను.
* ఏడవ గలిగితే ఏడ్చినకొద్ది వ్యవసాయం.
* ఏడాటం (ఇబ్బంది) మొగుడికి ఎత్తుభారం పెళ్ళాం.
* ఏడు ఎందల విన్ననాలు ఎంతవరకైనా ఆగుతాయి.
* ఏడు కరువులు వస్తున్నాయిరా అంటే, తొలి కరువులోనే పోతే మిగతా ఆరు ఎంచేస్తాయి అన్నాడుట.
* ఏడుకాంపులమ్మకు మూడు కాంపులమ్మ ముక్క నేర్పినట్లు.
* ఏడుగురిని మారిస్తే పెద్ద గౌడసాని.
* ఏడునెలలకు ఎందుకు నడకాలు అన్నట్లు.
* ఏడుపు ఏడింటి కనర్ధం.

No comments:

Post a Comment