Saturday, June 15, 2019

క - ఖ >>>> 10

* ఱ్ఱ విరగకుండా, పామూ చావకుండా కొట్టు.
* ఱ్ఱికుక్క కపిలగోవు అవుతుందా?
* ఱ్ఱు అరిగితేగాని, గరిసె విఱగదు.
* ఱ్ఱు అరిగితేనే కాపు బ్రతుకు.
* ఱ్ఱుగొట్టిన గంపెడు సూదులు.
* లక వేసిన చేప వలకు రాకుండాపోతుందా? (కలక వేయు=నీటిపై ఎగిరిపడు).
* లకాలం బ్రతికినా కాటికి పోక తప్పదు.
* లకాలం బ్రతికే బ్రతుకులు, కుడికాలు పెట్టవే కూతురా అన్నట్లు.
* లకాలపు దొంగ ఒకనాడు దొరకును.
* కలగక ఆడుమాట లయకాలునినైనా శమింపచేయును.
* కలగన్న చోటికి గంపనెత్తినట్లు.
* కలబంద ఎండు, కోడలి కొత్త లేదు.
* కలలో మూత్రం తాగినట్లు వస్తే, ఎవరితో చెప్పుకోను?
* కలలో కనిపించిన లంకెబిందెలు రాకపోయినా, పెరికి పెరికి పరువంతా నీళ్ళచాయ మాత్రం అయ్యింది. (నీళ్ళచాయ=చేబొంట్లకు, దొడ్డికి).
* కలలో కాంత నీటిలో నీడతో సమానం.
* కలలో జరిగింది ఇలలో జరుగదు.
* కలలోని కౌగిలికి కడుపులొస్తాయా?
* కలలో భోగం కలతోనే సరి.
* కలవారింటి ఆడపడుచుకు కాకరకాయ కానరాదు.
* కలిగింది తినేసి, కట్టుకున్నది విప్పేసి వెళ్ళమన్నట్లు.
* కలిగి ఉంటేనే కామితఫలములు కలిగేది.
* కలిగి ఉన్నవాడు రాజ్యాన్ని సున్నానికి తీసుకుంట అన్నట్లు.
* కలిగి తిననేర నివ్వదు గంపకమ్మ.
* కలిగితే కాళ్ళు ముయ్యా, లేకపోతే మోకాళ్ళు ముయ్యా.
* కలిగినది చెపితే కంట్లో పుల్ల పెట్టినట్లు.
* కలిగినమ్మ గాదె తీసేప్పటికి లేనివాని ప్రాణంపోయింది.
* కలిగినమ్మ గాడిదతో పోతే అదొక వ్రతం, లేనమ్మ మొగుడితో పోతే మోహం (గుల).
* కలిగినమ్మ ఱంకు, కాషాయ బొంకు.
* కలిగిన మాత్రం తిని, కరణం గారి కమతం చేయమన్నట్లు.
* కలిగినయ్య కలిగినవాడికే పెడతాడు, లేనయ్యా కలిగిన వారికే పెడతాడు.

No comments:

Post a Comment