* కరవమంటే పామైనా కరవదు.
* కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం.
* కరికి ప్రాణము తొండము, సిరికి ప్రాణాము మగువ.
* కరి గుట్టులో కాలుపెట్టదు, అంబటిలో వేలు పెట్టదు.
* కరిని గాంచిన కుక్క మొరిగిన సామ్యమౌ.
* కరువు కాలంలో ఒల్లని మొగుడు, పంతకాలంలో పంపమని వచ్చాడట.
* కరువుకు గ్రహణాలెక్కువ.
* కరువుకు చింతలు, కాలానికి మామిళ్ళు.
* కరువుకు తోడు ఆవపంట కలిగినట్లు.
* కరువుకు దాసరులైతే, పదాలెక్కడ వస్తాయి?
* కరువుకు మామిళ్ళు, కాలానికి నేరేళ్ళు.
* కరువునాటి కష్టలుండవు కానీ, కష్టాలనాటి మాటలుంటాయి.
* కరువులో అధిక మాసం.
* కరువులో అరువు.
* కరువులో బిడ్డను అమ్ముకొన్నట్లు.
* కరువు వస్తుందని సద్ది కట్టిపెట్టినట్లు.
* కర్మకంతం లేదు, కాలానికి నిశ్చయం లేదు.
* కర్మ చండాలుని కంటే, జాతి చండాలుడు మేలు.
* కర్మంగాలి మొగుణ్ణి కంబట్లో కట్టి, భుజం మీద వేసుకుంటే, జారి వీధిలో పడ్డట్టు.
* కర్కాటకం బిందిస్తే కాటకం ఉండదు (కర్కాటక మాసం=శ్రావణం).
* కర్కాటకం వర్షిస్తే, కాడిమోకు కూడా తడవదు.
* కర్ణుడులేని భారతం, శొంఠిలేని కషాయం ఒక్కటే.
* కర్ణుని తల భారత మన్నట్లు.
* కర్ణునితో ఉందమ్మా భారతయుద్దం అంతా అన్నట్లు.
* కర్ణునితో భారతం సరి, కార్తీక మాసంతో వానలు సరి.
* కఱకుల కళ్ళెం కల్యాణికి కాక గాడిదకేల? (కల్యణి=పంచ కల్యణి, గుఱ్ఱం).
* కఱిచే కుక్కకు కఱ్ఱ అడ్డం.
* కఱిచేది చెఱుకు, పట్టేది అనుము.
* కఱ్ఱకు పెట్టినా, గొఱ్ఱెకు పెట్టినా చెడదు.
* కఱ్ఱ చేతలేనివాణ్ణి గొఱ్ఱెకూడా కఱుస్తుంది.

No comments:
Post a Comment