Saturday, June 15, 2019

ఎ -ఏ >>>> 12

* ఏడుపులో ఏడుపు ఎడమచేయి చూపెట్టు అన్నట్లు.
* ఏడుమనువులు పెళ్ళైనా ఏకులరాట్నం తప్పలేదు.
* ఏడుమాటలు మాట్లాడినా, ఏడు అడుగులు నడిచినా గుణం తెలుస్తుంది.
* ఏడు మారినా, ఈడు ముదిరినా ఏమీమారదు ఈ లోకంలో.
* ఏడుమాసికాల చీర, ఎదురు బాసింగాల రవిక, జరుగుతూ జరుగుతూ నేను సారె కట్టుక వచ్చినాను.
* ఏడుమెతుకులు తింటే ఏనుగంత సత్తువ.
* ఏడుసార్లు పాసిన చేల్లో పండిన కంకితో ఏడుగుర్ని చంపవచ్చు.
* ఏడుస్తావు ఏమి ఎలుకా? అంటే నా బాధ నీకే మెఱుక అన్నదిట.
* ఏడుస్తున్న వాణ్ణి దాని(న)మ్మకాయలు కావాలా అంటే, దానికాయలే కావాలి అన్నాడుట.
* ఏడుస్తూన్నావెందుకు బ్రాహ్మడా? అంటే ఒకనాడు నామొగం నవ్వి చచ్చిందా అన్నాడట.
* ఏడుస్తూ ఏరువాక సాగిస్తే, కాడిమోకు దొంగలు దోచుకుపోయారుట.
* ఏడూళ్ళు తిరిగినా, ఎఱ్ఱకఱ్ఱిదాన్ని కొనమన్నారు.
* ఏడ్చి ఎంకటసామీ అనిపించుకొన్నట్లు.
* ఏడ్చి మొహం కడుకున్నట్లు.
* ఏడ్చేదాని ఎడమచేతి కిందా కుట్టెవాని కుడిచేతికిందా కూర్చోరాదు.
* ఏడ్చేదాని బిడ్డకు అరటిపండ్లు చూపినట్లు.
* ఏడ్చేదాని బిడ్డను ఆమే కనవలెను అన్నట్లు.
* ఏడ్చేదాని మొగుడు వస్తే, ఏకు వడికే దాని మొగుడూ వస్తాడు.
* ఏడ్చేదాని మొగుడు వస్తే, నా మొగుడూ వస్తాడు.
* ఏతానులో పీలిక ఆ తానుకు చెందినట్లు.
* ఏతాము ఎంతవంగినా తిరిగి లేచేదానికే కదా.
* ఏతాము పాటకు ఎదురులేదు.
* ఏదారి అంటే గోదారి అన్నట్లు.
* ఏది పట్టినా దెయ్యం పట్టినట్లు.
* ఏదీకాని వేళ గేదె ఈనినట్లు.
* ఏ దేముడు వరమిచ్చినా పెనిమిటిలేనిదే పిల్లలు పుట్టరు.
* ఏనుగంత తండ్రి ఉండేకంటే, ఏకంత తల్లి ఉండేది మేలు.
* ఏనుగ ఎక్కినవాడు, దొడ్డికంత దూరగలడా?
* ఏనుగు ఎత్తిపడితే (చతికిలపడితే) ఏనుగే లేవాలికానీ ఎవరు లేవతీయగలరు?
* ఏనుగు ఎత్తుబడినా గుఱ్ఱమంత ఎత్తు.

No comments:

Post a Comment