Saturday, June 15, 2019

ఎ -ఏ >>>> 13

* ఏనుగు ఒళ్ళు ఏనుగకు బరువు, చీమ ఒళ్ళు చీమకు బరువు.
* ఏనుగకు ఎలక్కాయలు లొటలొట.
* ఏనుగకు ఒక సీమ, గుఱ్ఱానికొక ఊరు, బఱ్ఱెకొక బానిస.
* ఏనుగకు కాలువిరగటం, దోమకు రెక్కవిరగటం సమము.
* ఏనుగకు సీళ్ళు చూపినట్లు (సిడి=అంకుశం).
* ఏనుగ తన నెత్తిన తానే మన్ను పోసుకున్నట్లు.
* ఏనుగ తొండము, యావ బట్టిన ముండ ఊరుకోవు.
* ఏనుగు దాహానికి చూరునీళ్ళా?
* ఏనుగుది ఎందరు కుడిస్తే తరుగుతుంది?
* ఏనుగునైనా ఎంటితో కట్తవచ్చు (ఎంటి=గడ్డిపరకలతో నేసిన త్రాడు).
* ఏనుగును ఇచ్చి అంకుశం దాచినట్లు.
* ఏనుగును ఎక్కినవాడు, కుక్క కూతకు జడియడు.
* ఏనుగును చూసి కుక్కలు మొరిగినట్లు.
* ఏనుగును తెచ్చి ఏకులబుట్టలోపెట్టి అది తన నెత్తిన పెట్టి, తనను ఎత్తుకోమన్నట్లు.
* ఏనుగునేక్కి రంకుకు పోయినట్లు.
* ఏనుగు పురుడోసుకొన్నట్లు.
* ఏనుగు పోతూనే ఉంటుంది, కుక్కలు మొరుగుతూనే ఉంటవి.
* ఏనుగు పోయేదారి ఎరుగడుగానీ, దోమలు పోయేదారిలో తొంగున్నాడు.
* ఏనుగు బ్రతికినా వెయ్యి, చచ్చినా వెయ్యి.
* ఏనుగు మదిస్తే నెత్తిన మన్ను పోసుకుంటుంది.
* ఏనుగు మింగిన వెలగపండువలె (కరిమింగిన వెలగపండు).
* ఏనుగు మీద ఎండ కాసినట్లు.
* ఏనుగుమీద దోమ (ఈగ) వాలినట్లు.
* ఏనుగుమీద పొయేవాణ్ణి సున్నమడిగినట్లు.
* ఏనుగు మోత, ఏనుగు మేత.
* ఏనుగు రొంపిలో కూరుకుపోతే కాకికి కూడా లోకువే.
* ఏనుగులను అప్పుగా ఇస్తున్నారంటే, రెండు తోలుకొని వచ్చి కట్టివేయమన్నాడట.
* ఏనుగులెగిరిపోతుంటే దోమలొక లెక్కా?
* ఏనుగులు ఏట కొట్టుకొనిపోతుంటే, పిల్లి పాటి రేవడిగిందట.
* ఏనుగులు ఏట గ్రుంకితే నక్క పాటిరేవడగ వచ్చిందట.

No comments:

Post a Comment