Saturday, June 15, 2019

క - ఖ >>>> 12

* కల్లరి నాలిక కోడెత్రాచు కోర వంటిది.
* కల్లలాడి కడుపు పల్లము నింపుకొన నేల?
* కల్లుకుండ కాడిదే కయ్యం, జుట్టు ఊడిపోయేదే దెయ్యం.
* కల్లు లొట్టెడి త్రాగి కైపెక్కి వదరిన శాస్త్రవాది కాడు.
* కల్లరికి మంచి ఙ్ఞాపక శక్తి అవసరం.
* కల్తీ విత్తనం వెల్తీ గాదెలు.
* కళాసు బ్రతుకు గాలివానతో సరి.
* కళ్ళం (కల్లం) పళ్ళెం పెద్దవిగా ఉండాలి.
* కళ్ళం వెళ్ళిన తరువాత కంది గుగ్గిళ్ళు.
* కళ్ళుకానని పెళ్ళికూతురు, కమతగాని వెంటపోయిందట.
* కళ్ళు కావాలంటాయి, కడుపు వద్దంటుంది.
* కళ్ళు రెండున్నా కనిపించే వస్తువొక్కటే.
* కళ్ళూ కలిగినప్పుడే చళ్ళువస్తే, మదపుటేనుగును మంచానికి కట్టేద్దును, నీదాకా రానిద్దునా అన్నదట.
* కవికి కంసాలికి సీసం తేలిక.
* కవితకు మెప్పు, కాంతకు కొప్పు.
* కవి యను నామంబు నీరుకాకికి లేదా?
* కవిత నేర్పు యతి కూర్పే తెలుపుతుంది.
* కవిత్వం గడ్డి అనుకొని గాడిదలన్నీ పడి మేయసాగినవట.
* కవిలి (కలే) చెట్లు కాస్తే, కారు (రెండవ పైరు) వరి పండుతుంది.
* కవిలి (కలే) చెట్లు పండితే కఱ(రు)వు తప్పదు.
* కవ్వం కదురు తిరిగిన ఇంట కరువు లేదు.
* కష్టపడి ఇల్లు కట్టి, కల్లుతాగి తగులబెట్టినట్లు.
* కష్టపడి సుఖపడమన్నారు.
* కష్టసంపాదనము, ఇష్టభోజనము.
* కష్టాలు కలకాలం కాపురముండవు.
* కష్టలు నిన్ను కష్టపెట్టేవరకు నీవుగా వాటిని కలయబెట్టకు.
* కష్టలు మానవులకు కాక మానులకా?
* కసవులేనుదే పశువులేదు, పశువులేనిదే పెంటలేదు, పెంటలేనిదే వంట లేదు.
* కరువులో పనసకాయ తరిగినట్లు.
* కసిపోనమ్మ మసిపూసుకున్నదట.

No comments:

Post a Comment