Saturday, June 15, 2019

క - ఖ >>>> 13

* కసాయివాడికి కత్తి అందించినట్లు.
* కసువుకు పోరా కమ్మా అంటే, కడుపునొప్పే నా అమ్మా; బొచ్చె ఎత్తుకరా బొమ్మ అంటే అట్లా చెప్పవే నా యత్తా అన్నాడుట.
* కస్తూరీ నలుపే, తెలకపిండీ నలుపే.
* కాంచనం కర్మ విమోచనం.
* కాంతల భ్రమలు కనుగట్టు మాయలు.
* కాంతా కనకం కాశ్యపులే కయ్యాలకు మూలం. (కాశ్యపి=భూమి)
* కాకరకాయకు కంతలు (గంట్లు) ఎన్ని? అంటే, ములగ కాయకు ముండ్లెన్నీ? అన్నాడట.
* కాకరబీకర కాకు జాతారే? అంటే దూబగుంటకు దూదేకను జాతారే అన్నాడట ఇంకో దూదేకుల సాహేబు. (ఉరుదు వచ్చిరాని దూదేకులవారి సంభాషణ).
* కాకి కఱ్ఱుమన్న కడుపాయె వదినా; కత్తవ బావికి పోతే కరిగిపోయె వదినా! (కత్తవ = ఏటికి కట్టిన అడ్డకొమ్మ (కట్ట)).
* కాకి కఱ్ఱుమంటే, మొగుణ్ణి అప్పా అనెనట.
* కాకి కావుమంటే, మొగుణ్ణి కౌగిలించుకొన్నట్లు.
* కాకికి కంకెడులేదు, పిట్టకు పిడికెడులేదు.
* కాకికూత బోలు కర్మ బంధుల కూత.
* కాకి కూయగాలేచి, కాటుకమాదిరి అన్నం కాకరకాయ మిరియం చేసి, పసువులొచ్చే వేళకు పరుగెత్తి పరుగెత్తి వడ్డించిందట.
* కాకి గూటిలో కోకిలపిల్ల వలె.
* కాకి గూడు పెడితే కడపటి వర్షం.
* కాకి చిక్కిన గొడ్డు డొక్కచీల్చునుగానీ, బలిసిన వసరం పొంత పోగలదా?
* కాకిని కొడితే గద్ద చచ్చిందట.
* కాకినితెచ్చి పంజరంలో పెడితే చిలుకపలుకు పలుకుతుందా?
* కాకిపిల్ల కాకికి ముద్దు.
* కాకిముక్కున దొండపండు వలె.
* కాకి ముక్కెర తన్నుకొనిపోయి డొంకలపాల్చేయుగానీ తినగలదా?
* కాకి సోమాల కుతురు-అంకమ్మకళల అల్లుడు (కాకిసోమాలు=వెఱ్ఱిచేష్టలు; అంకమ్మకళలు=అవ్యక్త చేష్టలు).
* కాకులు అరుస్తూనే ఉంటవి, కరవాడ ఎండుతూనే ఉంటుంది. (కరవాడ=ఉప్పు పట్టించి ఎండపెట్టిన ఉప్పునీటి చేప).
* కాకులను కొట్టి గద్దలకు వేసినట్లు.
* కాకుల మధ్య కోకిల.
* కాకులు రోకళ్ళెత్తుకు పోయినవి అన్నట్లు.
* కాకై కలకాలం ఉండేకంటే, హంసై ఆరునెలలున్నా చాలు.
* కాగల కార్యం గంధర్వులే తిరుస్తారు.
* కాచిన చెట్టుకు కఱకు రాళ్ళు.

No comments:

Post a Comment