Saturday, June 15, 2019

అ - ఆ >>>> 13

* అయ్యిందమ్మా పెళ్ళి అణిగిందమ్మా రంధి
* అయితంపూడి ఉద్యోగం అయితే గియితే,
* ఆరావుల పాడి చేస్తే గీస్తే పెరుగు,
* పాలు మా వాళ్ళకి పోస్తావా? మీవాళ్ళకి పోస్తావా?
* అంటూ పెళ్ళాన్నడిగాడట
* అయితే అవతల ఒడ్డు లేకపోతే ఇవతల ఒడ్డు
* అయితే ఆడబిడ్డ లేకపోతే మొగబిడ్డ
* అయితే ఆదివారం లేకపోతే సోమవారం
* అయితే అమీరు లేకపోతే ఫకీరు
* అయిదవతనం లేని అందం అడుక్కు తిననా?
* అయిదు శిఖలున్నా యిబ్బందిలేదు కానీ మూడుకొప్పులు చేరాయంటే ముదనష్టమే
* అయినకాడికి జమాబందీ
* అయినవాణ్ణి అడిగేకంటే కానివాడి కాళ్ళు పట్టుకోవడం మంచిది
* అయిన పెళ్ళికి మేళాలా?
* అయినవాడని ఇంటికి రానిస్తే ఇంటి దానికి కన్ను కొట్టాడట
* అయినవారు లోపలకు తోస్తే కానివారు బయటకు తోస్తారు
* అయినవాళ్ళకు ఆకుల్లోనూ కానివాళ్ళకి కంచాల్లోనూ
* అయోమయం అడవి మొద్దు
* అయ్యోపాపం అంటే ఆరు నెలల పాపం పైన పడ్తుంది
* అరకాసు పనికి ముప్పాతిక బాడుగ ఖర్చు
* అరగదీస్తే గంధపు చెక్కకు వాసన పోతుందా?
* అరగని కూడు - జరగని మాట
* అరఘడియ భోగం - ఆరు నెలల రోగం
* అరిచే కుక్క కరవదు
* అరచేత వెన్న పట్టుకొని నేతి కోసం ఏడ్చినట్లు
* అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి వరకూ నాకించినట్లు
* అరచేతిలో వైకుంఠం చూపినట్లు
* అరచేవాడి పంచన చేరవచ్చు గానీ, నాలిముచ్చు గడప త్రొక్కరాదు
* అర్ధరాత్రి యుద్ధం ఎక్కడంటే మల్లెల మంచం మీద అన్నదట
* అరటి కఱ్ఱు - జ్ఞాతి గుఱ్ఱు పోవు
* అరటికాయ ఆరు నెలల రోగం
* అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు
* అరణం కంటే మరణమే మేలు మగాడికి
* ఆరణ్య రోదనం లాగ
* అరనిమిషం తీరికలేదు - దమ్మిడీ ఆదా లేదు
* అరమనిషి సత్తువ - ఆరుగురి కోపం

No comments:

Post a Comment