Saturday, June 15, 2019

అ - ఆ >>>> 14

* అరవ లేని దేశం - కాకి లేని వూరు లేదు
* అరవై ఆరు పిండివంటలూ ఆవు చంటిలోనే వున్నాయి
* అరవై వూళ్ళ అమలుదారు ఆలికి దాసుడు
* అరవైఏళ్ళునిండినవాని ఆలోచన అడక్కు - ఇరవైఏళ్ళు నిండనివానికి పెత్తనం ఈయకు
* అరవైఏళ్ళ అన్నంభొట్లు అద్దాన్ని చూచి బిద్దం అంటే వాళ్ళమ్మకు ఆశ్చర్యం వేసిందట
* అరవై వరహాలిచ్చినా అత్తవంటి బానిస దొరకదు
* అరిశె ఆరు నెలల రోగం బయట పెడ్తుంది
* అరిశెల పాకం - అత్త పాకం తెలుసుకు మసలాలి
* అరుంధతీ, గిరుంధతీ కనపడ్డంలేదు గానీ అప్పు మాత్రం కనబడుతోంది అన్నాడట
* అరువు సొమ్ము బరువు చేటు
* అరువుగా యిస్తానంటే ఆరు ఏనుగులు పంపమన్నట్లు
* అర్ధంకాని మాట - అల్లిబిల్లి మాట
* అర్ధబలం కంటే - అంగబలం ముఖ్యం
* అర్ధరాత్రివేళ అంకమ్మ శివాలు
* అర్ధరాత్రివేళ మద్దెల దరువులు అన్నట్లు
* అర్జీలకు పనులూ కావు - ఆశీర్వచనాలకు బిడ్డలూ పుట్టరు
* అలంకారం కంటే అయిదవతనం మేలు
* అలకపాన్పు మీద అల్లుడలిగితే అత్తగారు కంగారు పడినట్లు
* అలకాపురం కొల్లగొట్టినా అదృష్టహీనునికి దక్కేదేమీ వుండదు
* అలలు నిల్చేదెప్పుడు? స్నానం చేసేదెప్పుడు?
* అలక మీరితే అమృతమైనా విషమే
* అలికిన యింట ఒలికినా అందమే
* అలిగే బిడ్డతోనూ - పొడిచే గొడ్డుతోనూ కష్టం
* అలిగి అత్తవారింటికి - చెడి చెల్లెలింటికి పోరాదు
* అలుపుల మాటే లేదు గెలుపుల వూసేలేదు రసరాజ్య జాతరలో అన్నట్లు
* అల్పవిద్యా మహాగర్వీ
* అల్ప విద్వాంసుడు ఆక్షేపణలకు పెద్ద
* అల్పుడికి ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమన్నాడట
* అల్పుని చేరదీస్తే అధిక ప్రసంగం - కుక్కను చేరదీస్తే మూతి నాకుడు
* అల్లుడని పేరుపెట్టి పుల్ల విరిచి వేస్తే ఎగిరి పడుతుంది
* అల్లుడా ఎప్పుడొచ్చావని అడిగితే రాత్రి వండిన గారెల సంగతి చెప్పనా అన్నాడట
* అల్లుడి కత్తికి రెండు వైపులా పదునే
* అల్లుడికి చేసినవంట అతిథికి కూడా వచ్చినట్టు
* అల్లుడికి నెయ్యి లేదు అల్లుని వెంట వచ్చిన వానికి నూనె లేదు
* అల్లుడికి పెట్టినట్లు కొడుక్కి పెడితే యిల్లు గుల్లవుతుంది
* అల్లుడి గుణం అనుభవంలో గానీ తెలీదు
* అల్లుడితో గిల్లుడన్నట్లు
* అల్లుడితో భోజనం, కొడుకుతో చదువు
* అల్లుడంటే చాలు - వంకర తాడి కూడా నిఠారుగా నుంచుంటుందట
* అల్లుడలిగితే కూతుర్ని తీసుకుపోతాడు అంతేగా?
* అల్లుడికి బెట్టు - యిల్లాలికి గుట్టు వుండాలన్నట్లు
* అల్లుడు చుట్టమూ గాదు - ఆముదపు చెట్టు చెట్టూకాదు
* అల్లుడు దశమగ్రహం
* అల్లుని గుడ్డి తెల్లవారితే తెలుస్తుంది

No comments:

Post a Comment