* ఏనుగులు మింగిన ఎల్లమ్మకు పీనుగలు పిప్పళ్ళు.
* ఏపట్లా చావకపోతే బాపట్లకు పంపండి.
* ఏపాటు తప్పినా సాపాటు తప్పదు.
* ఏపుట్టలో ఏ పామో? ఏ గుళ్ళో ఏ మహత్యమో.
* ఏ పూజ తప్పినా పొట్ట[పూజ తప్పదు.
* ఏబ్రాసికి పని ఎక్కువ, లోభికి ఖర్చెక్కువ.
* ఏబ్రాసి పెళ్ళికెడుతూ ఉంటే ఏకులరాట్నం ఎదురయిందట.
* ఏమండీ కరణం గారు గోతిలో పడ్డారే? అంటే, కాదు మషాకత్తు చేస్తున్నా అన్నాడట.
* ఏమందలో కట్టినా మన మందలో ఈనితే సరి.
* ఏమయ్యా మా వారు బాగున్నారా? అంటే, అమ్మా బాగానే ఉన్నారు; విత్తనాలు వడ్లు తింటున్నారు, దాపుడు బట్టలు కడుతున్నారు ఆన్నడట.
* ఏమి అప్పాజీ అంటే కాలం కొద్ది రాయాజీ అన్నట్లు.
* ఏమిచేసి బ్రతుకుతున్నావమ్మా? అంటే నోరుచేసుకు బ్రతుకుతున్నా బిడ్డా అన్నదిట.
* ఏంచేస్తున్నావురా? అంటే ఒలకపోసి ఎత్తుకుంటున్నా అన్నట్లు.
* ఏమిట్రా మేనమామ ముడ్డిలో కట్టె పెడతావు? అంటే, చిన్నాయన అనుకున్నాను అన్నడట.
* ఏమిపెట్టుక తిన్నావు? అంటే, ఆకలెట్టుక తిన్నానందిట.
* ఏమిరా వెఱ్ఱిమొగమా? అంటే, ఏమి చిన్నాయనా అన్నాడట.
* ఏమి పోలిసెట్టి? అంటే, ఎప్పటి మొత్తుకోళ్ళే అన్నడట.
* ఏమిరా కోటా? అంటే, ఎప్పటిదే ఆట అన్నడట.
* ఏమీ ఎరుగనోడు ఏకాశిన చస్తే అన్నీ తెలిసినోడు అమావాశ్యనాడు చచ్చాడట.
* ఏమీ ఎరుగని ఎల్లి పాయె, దొంతులేస్తే దొల్లిపోయె.
* ఏమీ ఎరుగని పిల్ల మామను మరిగిందట.
* ఏమీ తోచకపోతే ఎక్కిరించాడట.
* ఏమీ తోచనమ్మ తోడికోడలి పుట్టింటికి వెళ్ళిందట.
* ఏమీ లేదంటగానీ ఎల్లుండి పెండ్లంట.
* ఏమీ దొరకనమ్మకు ఏగాణి దొరికితే ఎందులో పెట్టనే ఎంకాయమ్మా అన్నదిట.
* ఏమీలేనమ్మకు ఏడ్పులు శృంగారం.
* ఏమీ లేనమ్మకు ఏతులు లావు, ఉన్నమ్మకు ఆశలు లావు (ఏతులు=ఎచ్చులు, డంబాలు).
* ఏమీ లేనిదానికి ఏతులు లావు, స్వాములవారికి జడలు లావు.
* ఏమే వాడి దగ్గర పడుకున్నావు? అంటే, అంత పెద్దమనిషి చెయ్యిపట్టుకుంటే కాదనే దెట్లా? అన్నదిట.
* ఏమోయి నీకూతురలా తిరుగుతున్నది? అంటే, అలవాటుపడిన ముండను అట్లానే పోనీస్తూ అన్నాడట.

No comments:
Post a Comment