Saturday, June 15, 2019

క - ఖ >>>> 14

* కాచినచెట్టుకే కఱ్ఱదెబ్బలు.
* కాచినగంజి తాగనిస్తే నేను కమ్మనాయుడనే (కాపు) నే కాదు అన్నాడట.
* కాటికి కాళ్ళుజాచి, తిండికి చేతులు జాచినట్లు.
* కాటికి పోయినా కరణాన్ని నమ్మరాదు.
* కాటిపోయినా కాసు తప్పదు.
* కాటికి పోయిన పీనుగు, కట్టెలపాల్గాక ఇంటికి వస్తుందా?
* కాటి దగ్గఱి మాటలు కూటిదగ్గర ఉండవు.
* కాతిలో పండినవి, కాకులు తిన్నవి-ఒకటి.
* కాడికిందకి వచ్చిన గొడ్డు, చేతికిందకు వచ్చిన బిడ్డ.
* కాడిన పోట్లలో కత్తితో గీకినట్లు. (కాడిన=గుచ్చుకొనిన, తెగిన)
* కాడు కాలుతూ ఉంటే, కన్నె ఎదుగుతూ ఉంటుంది.
* కాదు అంటే కళ తక్కువ, అవును అంటే ఆయుస్సెక్కువ.
* కాదు అన్నవాడే కరణం.
* కాదు కాదు అంటే, నాది నాది అన్నడట.
* కాదనకుండా కట్టెనిచ్చెను గానీ వినబడకుండ వీరణాలు వాయించగలవా?
* కానకుండ మాట్లాడే మాటా, కడగని గుద్ద ఒకటే.
* కానని ముఖానికి గంధము అక్షతలు.
* కానవచ్చే కొండలను గట్టెక్కి చూడటం ఎందుకు?
* కాని కాలాన ఆలే పెండ్లం (వ్యంగ్యం).
* కాని కాలానికి కంది అయినా కాయదు.
* కాని కాలానికి కఱ్ఱే పామై కాటేస్తుంది.
* కానికాలానికి పైబట్టను పక్షులెత్తుకు పోతాయి.
* కానీకి టెంకాయ ఇస్తారని కాశీకి పోయినట్లు.
* కానిచోట కందైనా కాయదు.
* కాని దానికి కంతలు మెండు.
* కానిపనులు సేయ ఘనులాస పడుదురా?
* కానిదానికి కష్టం మెండు, చెల్లని కాసుకు గీతలు మెండు.
* కానివాడు లేనివానితో జత.
* కానివేళకు కందులే గుగ్గిళయినట్లు. (వ్యంగ్యం).
* కానుగ నీడ-కన్నతల్లి నీడ.

No comments:

Post a Comment