Saturday, June 15, 2019

క - ఖ >>>> 17

* కాలం పోతుంది, మాట నిలుస్తుంది.
* కాలం మారి కంచు పెంకైనట్లు.
* కాలం మూడిన వ్యక్తికి కాశీకిపోయినా సేగితప్పదు.
* కాలంలో విత్తనాలు కలలోనైనా చల్లాలి.
* కాలం వస్తే, గాడిదకాళ్ళు తిన్నన.
* కాల కర్మగతుల కనిపెట్టవలెనయా.
* కాలక్షేపంలేకపోతే, కంచిమేకను కొనుక్కోమన్నారు.
* కాలతంతే పెరిగేది పుచ్చకాయ, కుళ్ళేది గుమ్మడీకాయ.
* కాలను పాతకొయ్య, తాగను పాతకల్లు, నమ్మను పాత స్నేహితుడు, చదవను పాత పుస్తకాలు శ్రేష్టములు.
* కాలమందు చేస్తే దేవతలకు ప్రీతి, అకాలమందు చేస్తే అసురులకు ప్రీతి; ఇద్దరివాతా మన్నుకొడతాను అన్నట్లు.
* కాలమా ? యాలమా? కడకు చూడె పెళ్ళామా?
* కాలమొక్కరీతి గడిపినవాడే గడచి బ్రతికినవాడు.
* కాలానికి కడగండ్లు, దేశానికి (ముప్పు) తిప్పలు.
* కాలికి చుట్టుకున్న పాము కఱవక మానదు.
* కాలికి దూరమైతే కంటికి దూరమా?
* కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి.
* కాలికి బలపం కట్టుకొని కడప ముగ్గులు పెడతాడు.
* కాలికి రాని చెప్పును కంచెలో వేయమన్నారు.
* కాలికి రాని చెప్పు కడగా ఉంచు.
* కాలికోసం చెప్పులు ఒళ్ళో పెట్టుకోవాలి?
* కాలినట్టి మ్రాకు కడురమ్యమై ఉండును.
* కాలితో కదుపుకోవటం, చేతితో జుఱ్ఱుకోవడం.
* కాలితో నడిస్తే కాశీకి పోవచ్చునుగానీ, తలతో నడిస్తే తనవాకిలి దాటవచ్చునా?
* కాలిది తీసి నెత్తికి రాసుకున్నట్లు.
* కాలిన గుడిసెకు పీకిన వాసమే లాభం.
* కాలిన మన్నూ,కాలని మన్నూ అంటవు (అతకవు).
* కాలి మెట్లు తలకెక్కినట్లు.
* కాలి కడుగ ముంత లేదు, కల్లుకు కళాయి గిన్నె.
* కాలికాలిన పిల్లి వలె (తిరుగాడుట).
* కాలూ చెయ్యీ ఉన్నంతకాలం కాలం గడుస్తుంది.
* కాలు జారితే గంగానమ్మదే మహిమ - అన్నట్లు.

No comments:

Post a Comment