Saturday, June 15, 2019

అ - ఆ >>>> 18

* ఆత్రగాడికి బుద్ధి తక్కువ
* ఆత్రానికి పోతే ఆడపిల్ల పుట్టినట్లు
* ఆదర్శాలు శిఖరమెక్కితే, అవసరాలు అగాధంలోకి తోస్తాయి
* ఆదాయంలేని శెట్టి వరదకు పోడు
* ఆదిలోనే హంసపాదన్నట్లు
* ఆ పడుగులోనిదే ఈ పీలికా
* ఆపదకు పాపం లేదు
* ఆపద మ్రొక్కులు - సంపద మరపులు
* ఆపదలైనా, సంపదలైనా ఒంటరిగా రావు
* ఆపదలో అడ్డుపడే వాడే చుట్టము
* ఆపదలో ఆదుకోవాలి, ఆస్థిలో పంచుకోవాలి
* ఆమడ నడిచినా ఆరిక కూడు తప్పలేదు
* ఆమని సోయగాలు అందాలు విందులు అన్నట్లు
* ఆ మాటా ఈ మాటా యింటి పెద్దకు
* ఆమాటకూ, ఈ మాటకూ పెద్దకోడలు - ఆచేతి తుడుపుకూ, ఈచేతితుడుపుకూఅడ్డుగోడ
* ఆముదాల బేరం - కామెర్ల రోగం నమ్మరానివి
* ఆయ మెరిగి వ్యయం చేయాలి
* ఆయాసాల మొగుడికి రేసు గుర్రంలాటి భార్య అన్నట్లు
* ఆయుర్దాయం గట్టిగా వుంటే అడవిలో వున్నా బ్రతకవచ్చు
* ఆయుర్దాయం వున్న రోగి హస్తవాసి వున్నా వైద్యుడి దగ్గరికే పోతాడు
* ఆయువు గట్టిదయితే చాలు అన్ని రోగాలు పోతాయి
* ఆయుష్యం ఆరుపాళ్ళు - యాతన ఏడు పాళ్ళు
* ఆయుష్షు లేక చచ్చాడు గానీ వైద్యం లేక కాదు
* ఆయెనమ్మా పెండ్లి - అణిగెనమ్మా రంధి
* ఆరంభ శూరుడికి ఆర్భాటాలెక్కువ
* ఆరగించగా లేనిది అడిగితే వచ్చిందా!
* ఆరాటపు పెళ్ళి కొడుకు పేరంటాళ్ళ వెంట పడ్డాడట
* ఆరాటమేగానీ పసలేదన్నట్లు
* ఆరాటాల పెళ్ళాం - ఆయాసాల మొగుడు
* ఆరికకు చిత్త గండం - ఆడదానికి పిల్ల గండం
* ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ
* ఆరు కార్తెలకు పోతు ఆరుద్ర కార్తె

No comments:

Post a Comment