Saturday, June 15, 2019

అ - ఆ >>>> 19

* ఆరుద్ర కార్తె విత్తనానికీ - అన్నం పెట్టిన యింటికీ చెరుపు లేదు
* ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయి
* ఆరుద్ర కురిస్తే దారిద్ర్యం లేదు
* ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు
* ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడతాయి
* ఆరుద్రతో అదను సరి
* ఆరుద్రలో అడ్డెడు చల్లితే, సులువుగా పుట్టెడు పండుతుంది
* ఆరుద్ర వాన అదను వాన
* ఆరుద్రకు ఆమ్లాలు కూడా పండుతాయి
* ఆరు నెలలకు చచ్చేవాడికి అరుంధతి కనపడదు
* ఆరునెలల సహవాసం చేస్తే వారు వీరవుతారు
* ఆరు నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మతో యుద్ధం చేసినట్లు
* ఆరు రాజ్యాలను జయించవచ్చు కానీ అల్లుడిని జయించలేం
* ఆర్భాటపు ఆడదానికి ఆరుగురు మొగుళ్ళు
* ఆర్చేవారే గానీ తీర్చేవారే లేరు
* ఆరోగ్యమే మహాభాగ్యం
* ఆలిఅలుక అరవైఏండ్లు, మగనిఅలుక ముప్పై ఏండ్లు, బాలప్రాయం పదేళ్ళు
* ఆలికి అదుపు - ఇంటికి పొదుపు
* ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా?
* ఆలికి లొంగినవాడూ, అరగాణిలో పడినవాడూ ఉక్కిరి బిక్కిరి అవుతాడు
* ఆలిని అదుపులో పెట్టలేడు గానీ, మందిని అదుపులో పెడతాడట
* ఆలిని విడిస్తే హరిదాసు - సంసారం విడిస్తే సన్యాసి
* ఆలి మాట విన్నవాడూ - అడవిలో పడ్డవాడూ ఒక్కడే
* ఆలి వంక వారు ఆత్మ బంధువులు
* ఆలి శుచి ఇల్లు చెబుతుంది
* ఆలి ఏడ్చిన ఇల్లు - ఎద్దు ఏడ్చిన సేద్యం కలసిరావు
* ఆలి చచ్చిన వారికి ఆలి బంగారం
* ఆలి బెల్లం - తల్లి విషం
* ఆలుమగల కలహం అద్దం మీద ఆవగింజ వేసినంతసేపే
* ఆలుమగల కలహం అన్నం తినేదాకానే
* ఆలుమగల కలహం కౌగిళ్ళలోకి చేరే వరకే
* ఆలు లేత - నారుముదురు
* ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు
* ఆవగింజంత సందు వుంటే అరవై గారెలు తిననా? అన్నాడట
* ఆవాలు ముద్ద చేసినట్లు
* ఆవాహనా లేదు, విసర్జనా లేదు
* ఆవు చేలో మేస్తే దూడ గట్టుమీద మేస్తుందా?

No comments:

Post a Comment