Saturday, June 15, 2019

అ - ఆ >>>> 20

* ఆవు తొలి చూలు - గేదె మలిచూలు మంచిది
* ఆవునిచ్చి పలుపు దాచుకున్నట్లు
* ఆవును చంపి చెప్పులు దానం చేసినట్లు
* ఆవు పాడి ఎన్నాళ్ళు? ఐశ్వర్య మెన్నాళ్ళు?
* ఆవులను మళ్ళించినవాడే అర్జునుడు
* ఆవులలో ఆబోతై తినాలి - అత్తవారింట అల్లుడై తినాలి
* ఆవులిస్తే ప్రేగులు లెక్కబెట్టినట్లు
* ఆవులూ ఆవులూ పోట్లాడుకుంటూ లేగల కాళ్ళు విరగత్రొక్కినట్లు
* ఆవు లేని యింట అన్నమే తినరాదు
* ఆవేశం ఆకాశమంత - ఆలోచన ఆవగింజంత
* ఆశకు అంతు లేదు - గోచీకి దరిద్రం లేదు
* ఆశకు అంతం లేదు - నిరాశకు చింత లేదు
* ఆశకు పోతే గోచీ వూడిందట
* ఆశకు మించిన దూరం - వడ్డీకి మించిన వేగం లేవు
* ఆశకు ముదిమి - అర్థికి సౌఖ్యం లేవు
* ఆశ గలమ్మ దోష మెరుగదు - పూటకూళ్ళమ్మ పుణ్య మెరుగదు
* ఆశ బోధిస్తున్నది - అవమానం బాధిస్తున్నది
* ఆశబోతు బాపనికి గోచీపాతే సంచి
* ఆశలు తగ్గించుకుంటే అశాంతికి తావులేదు
* ఆశ సిగ్గెరుగదు - నిద్ర సుఖ మెదుగదు
* ఆశ్లేష కురిస్తే ఆరోగ్యమంటారు
* ఆశ్లేష వర్షం అందరికీ లాభం
* ఆశ్లేషలో ముసలి ఎద్దు కూడా రంకె వేస్తుంది
* ఆశ్లేష ముసలి కార్తె - ఆగి ఆగి తుంపర తుంపరగా కురుస్తుంది
* ఆశ్లేషలో అడుగుకొక చినుకు పడినా అడిగినన్ని వడ్లు
* ఆశ్లేషలో అడ్డెడు చల్లటం మేలు
* ఆశ్లేషలో ఊడ్చినట్లయితే అడిగినంత పంట
* ఆశ్లేషలో తడిస్తే ఆడది మగవాడౌతుంది
* ఆశ్లేషలో పూస్తే అంతులేని పంట
* ఆషాఢమాసంలో అరిశెలు వండను ప్రొద్దు వుండదు
* ఆషాఢానికి ఆకుపోతలు
* ఆసక్తి మారకం - అనాసక్తి తారకం
* ఆసనంలో పుండు - అల్లుడి వైద్యం
* ఆసులో పుల్లలా తిరిగినట్లు
* ఆస్థికొక కొడుకు - ప్రేమకొక కూతురు
* ఆహారం పట్ల వ్యవహారం పట్ల మొగమాటం పనికిరాదు

No comments:

Post a Comment