* కాసీ పూసే చింతా, గన్నారపు సంత, నీళ్ళకడవముంత, నిద్రకేమి పుచ్చుకుంటావే?
* కాసుకు కాలెత్తే దానికి కాశీయాత్ర కావలెనా?
* కాసుకు గతిలేదు, కోటికి కొడి ఎత్తినాడు. (కొడి=పతాకము).
* కాసుగలమ్మ కట్టవిప్పా, వీసంగలమ్మ విడవా మడవా.
* కాసు గొడ్డుకు రూక బందె.
* కాసును వెతుకగా రత్నము గన్న రీతి.
* కాసుకు మూతినాకబోతే మూడు నూర్ల ముంగర పోయిందట.
* కాసులకును దిరుగ కలుగునా మోక్షంబు.
* కాసులేనివాడు కడు బ్రహ్మచారియౌ.
* కించిత్తు నల్లి గరచిన మంచమునకు పెట్లు వచ్చు.
* కింద ఒకబొంత, మీద ఒకబొంత, నాకేమి చింత?
* కింద పడినా మీసాలకు మన్ను కాలేదన్నట్లు.
* కిందపడ్డా, పీటికి మన్ను కాలేదు (పీట=వీపు)
* కిందపెట్టిన పంటలుండవు, పైన పెట్టిన వానలుండవు.
* కిందబెట్టిన పంటెలుండవు, పైన పెట్టిన బానలుండవు.
* కింద పడ్డా, పైచేయి నాదే అన్నట్లు.
* కింద మట్ట రాలుతుంటే, పైమట్ట నానవేస్తుంది.
* కిఱ్ఱులో కిఱ్ఱు కలిస్తే కంపేడకు పోతుంది?
* కీలెంచి మేలెంచవలెను.
* కీర్తిమార్గం కాటికే దారిచూపును.
* కీలూడిన యంత్రం-తొండములేని ఏనుగు.
* కీలెఱిగి వాత పెట్టలి.
* కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు (తల్లికి).
* కుంచంలో కుదుళ్ళు పోసినట్లు.
* కుంచాలమ్మ కూడువేస్తే, మంచాలమ్మ మాయం చేసిందట.
* కుంచెడుంటే కుడికొప్పు, అడ్డెడుంటే ఎడమకొప్పు.
* కుంచెడు గింజలకు కూలిపోతే, తూమెడు గింజలు దూడలు తినిపోయినవట.
* కుంచెడున్నమ్మకు కూర్కు పట్టదు.
* కుంజరయూధమ్ము దోమ కుత్తుక జొచ్చినట్లు.
* కూంజరాశి ఉన్న గుహ ప్రవేశించునే, సత్యహీనమైన జంబూకంబు?
* కుంటి ఎద్దు రానిదే దూలమెత్తరు.

No comments:
Post a Comment