Saturday, June 15, 2019

క - ఖ >>>> 20

* కుంటికులాసం, ఇంటికి మోసం.
* కుంటి గాడిదకు జారిందే సాకు.
* కుంటి గుఱ్ఱానికి జారిందే సాకు.
* కుంటి గుఱ్ఱాలు, తోలు కత్తులు.
* కుంటివానికి కుయుక్తులెక్కువ.
* కుంటి వాని తిప్పలు కుంటివానికి, గూనివాని తిప్పలు గూనివానికి.
* కుంటివాని పారుపత్తెము ఇంటి ముందఱే.
* కుంటి సాకులు-కొంటె మాటలు.
* కుంటోడైనా ఇంటోడు మేలు.
*  కుండ ఎప్పుడు వేఱో, కుదురు అప్పుడే వేఱు.
*  కుండమార్పు మనువులు కూడైనావస్తవి, కుమ్మయినా అవుతవి.
*  కుండను మూయను మూకుడున్నది గానీ, లోకుల నోరు మూయనేమున్నది?
*  కుండల దుమ్మును రోకళ్ళతో దులిపినట్లు.
*  కుండలు, చేటలు లేవని వండుకతినటం మానుకుంటామా?
*  కుండలు దాచినా, కండలు దాచలేము.
*  కుండలోకి కూడూ, గుదములోకి గూటాము తా తెచ్చుకుంటేనే గానీ రావు.
*  కుండలో కూడుంటే, ముండకు నిద్ర రాదు.
*  కుండలో కూడు కదలకుండా ఉండాల, బిడ్డలు మాత్రం పెరగాల.
*  కుండలో కూడుమాత్రం కుండలో ఉండాల, బిడ్డ గుండ్రాయి మాదిరి కావాల.
*  కుండలో గుఱ్ఱాలు తోలినట్లు.
*  కుండలో మెతుకులన్ని పట్టిచూడవలెనా?
*  కుండలో లేనిది నా సిండలోనుండి తెచ్చిపెట్టనా అన్నదిట.
*  కుండవెళ్ళి బిందెకు తగిలినా, బిందె వచ్చి కుండకు తగిలినా కుండకే మోసం.
*  కుండ వేరైతే, కులం వేరా?
*  కుందేటి కొమ్ము సాధించినట్లు.
*  కుందేలు దొరికే వేళకు కుక్కకు బయటికి వచ్చిందట.
*  కుందేళ్ళతో గూడా పరుగెత్తి, కుక్కలతో గూడా వేటాడినట్లు.
*  కుంపట్లో తామర మొలచినట్లు.
*  కుంభకర్ణుని నోటికి అరకాసు మజ్జిగా?
*  కుక్క ఇల్లు సొచ్చి కుండలు వెదకదా?

No comments:

Post a Comment