* ఉంగరం చెడిపి బొంగరం, బొంగరం చెడిపి ఉంగరం చేసినట్లు.
* ఉంగరాలచేతితో మొట్టేవాడు చెబితేనే వింటారు.
* ఉంచుకున్నవాడు మొగుడు కాదు, పెంచుకున్న వాడు కొడుకుకాడు.
* ఉంటే అమీరు లేదా పకీరు.
* ఉంటే ఉగాది లేదా శివరాత్రి.
* ఉంటే ఊరు, లేదా పాడు.
* ఉంటే అమీరుసాహేబు, లేకుంటే పకీరుసాహెబు, చస్తే పీరుసాహెబు.
* ఉండ ఇల్లు లేదు, పండ మంచం లేదు.
* ఉండనిస్తే పండుతుంది, ఊడదీస్తే ఎండుతుంది.
* ఉండమనలేక ఊదర, పొమ్మనలేక పొగ పెట్టినట్లు.
* ఉండి ఉండి ఉప్పరవానిని(తో) పోతే, చచ్చేదాకా తట్టలమోతే.
* ఉండి ఉండి ఉప్పరవానిని కట్టుకుంటే, తట్ట తట్టకూ తలపోతలే.
* ఉండిచూడు ఊరు అందము, నానాటికిచూడు నా అందము.
* ఉండే ఒకబిడ్డా బసివి ఐనట్లు.
* ఉండే ఖర్మ చాలక ఉపకర్మ ఇంకొకదానిని తెచ్చుకొన్నట్లు.
* ఉండేందుకు స్థలం ఇస్తే పడుకోవటానికి మంచం అడిగినట్లు.
* ఉండేది ఒక్క పిల్ల, ఊరంతా మేనరికం.
* ఉండేది గడ్డి, పోయేది పొట్టు.
* ఉన్నవాడు ఉలవ, పోయేవాడు నువ్వు.
* ఉండ్రాళ్ళు ఒక పిండి వంటేనా? మేనత్త కొడుకు ఒక మొగుడేనా?
* ఉండృఆళ్ళు పిండివంటా కాదు, ఊదర ధాన్యమూ కాదు.
* ఉండ్రాళ్ళ మీద భక్తా? విఘ్నేశ్వరుడి మీద భక్తా?
* ఉగ్గుతో చేర్చిన గుణం నుగ్గులతోగానీ పోదు.
* ఉచితానికి ఊళ్ళు, లెక్కలకి కాసులు.
* ఉ(చ్చ)కుండ ఉట్టికెత్తి నేతికుండ నేలను బెట్టినట్లు.
* ఉచ్చగుంటలో చేపలు పట్టినట్లు.
* ఉచ్చపోసి గొరిగించారు అంటే ఎన్ని ముంతలు అన్నట్టు.
* ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కునా?
* ఉట్టికి ఎగరలేని వాడు స్వర్గానికి ఎగురుతా అన్నట్లు.

No comments:
Post a Comment