* ఈ చేత చేస్తారు, ఆ చేత అనుభవిస్తారు.
* ఈ జొన్నకూటికా ఈ స్తోత్రపాఠం?
* ఈటెపోటు మానుతుంది కానీ, మాటపోటు మానదు.
* ఈడిగవాని ఇంట్లో పాలు తాగినా కల్లే అంటారు.
* ఈడుగానిది ఇంటికిరాదు, జోడుగానిది దొడ్డికి రాదు.
* ఈడుచూసి పిల్లనియ్యి, పిడిచూసి కొడవలియ్యి.
* ఈడ్పుకాళ్ళు, ఈడ్పుచేతులూ, ఇతడేనమ్మా ఇల్లిటపుటల్లుడు.
* ఈడ్పుకాళ్ళవానికి ఇద్దరు భార్యలు, ఒకతి ఈడవ, ఇంకొకతి ఏడవ.
* ఈతకట్టెల నిప్పు ఇంటికి రాదు, ఈడిగవాని పెండ్లాము చేతికి రాదు.
* ఈతకు మించిన లోతులేదు, గోచీకి మించిన దరిద్రం లేదు.
* ఈతగింజ ఇచ్చి తాటిగింజ లాగినట్లు.
* ఈతచెట్టు ఇల్లుకాదు, తాటిచెట్టు తల్లికాదు.
* ఈతచెట్టు కింద (తాటిచెట్టు)పాలి తాగినా కల్లే అంటారు.
* ఈతనీళ్ళు పడితే పాతజోళ్ళు వెళ్ళుతవి; ఇప్పనీళ్ళు (నీళ్ళు--కల్లు) పడితే ఎప్పటిజోళ్ళైనా వెళ్ళుతవి.
* ఈతవచ్చిన వానికే జలగండం.
* ఈతవచ్చినప్పుడు లోతనిపించునా?
* ఈనగాచి నక్కలపాలు చేసినట్లు.
* ఈనిన పిల్లికి ఇల్లూ వాకిలి తెలియనంత ఆకలి.
* ఈనిన పులికి ఆకలెక్కువ.
* ఈనాడు ఇంటిలో, రేపు మంటిలో.
* ఈ నెలలో వడ్డీలేదు, వచ్చేనెలలో అసలూ లేదు.
* ఈపిలేని చోట పేలు వెతికినట్లు.
* ఈ పొడుము పీల్చనీవే, నీ పాడె బిగిస్తా అన్నాడుట.
* ఈ ముడ్డి ఇట్లాంటి ఏర్లను ఎన్ని చూడలేదంటే, ఈ ఏరు ఇట్లాంటి ముడ్లను ఎన్నిటిని చూడలేదు అన్నట్లు. (కప్ప ఎగిరితే నీటిమీద అలిగి ముడ్డి కడుక్కోకుండ వచ్చిన వాడు అని, అనిపించుకొన్న మాట.)
* ఈ మొహానికా సేరు పసుపు?
* ఈ మొద్దు మొహానికా ఆ గరుడసేవ.
* ఈరక్క పెండ్లిలో పేరక్క గర్భదానం.
* ఈవల గట్టున ఉండే ఆవుకు ఆవలిగట్టు పచ్చన.
* ఈలోకంలో ధర్మంఉంటే పరలోకంలో బంధువవుతుంది.
* ఈవేళ చస్తే రేపటికి రెండు.
* ఈ సంబడా(ళా)నికేనా ఇంత సంబరం? (సంబడం=సంబరం, వేడుక; సంబళం=జీతం).

No comments:
Post a Comment