Saturday, June 15, 2019

ఒ - ఓ >>>> 1

* ఒంటరివాని పాటు ఇంటికి రాదు.
* ఒంటి కంటే జంట మేలు.
* ఒంటికి ఓర్వలేనమ్మ, రెంటికి ఓర్చునా?
* ఒంటి చేతి దాహం, ఒకనాలి పొందు తనివి తీరవు.
* ఒంటెలుకు పోతే రెండేళ్ళకు వచ్చిందట.
* ఒంటేలుకు పోయి ఇంతసేపేమిటిరా అంటే రెండేళ్ళకు వచ్చింది అన్నడుట.
* ఒక ఈగ బండి చక్రం మీదవాలి ' నేనెంతదుమ్ము రేగకొడుతున్నానబ్బా' అని మురిసిపోయిందట.
* ఒక ఊరికాపు ఇంకొక ఊరి మాల.
* ఒక ఊరి రాజు, ఇంకొక ఊరికి రైతు.
* ఒక ఒరలో రెండు కత్తులిముడునా?
* ఒక కంటిలో సున్నం, ఇంకో కంటిలో వెన్న.
* ఒక కన్ను కన్నూ కాదు, ఒక కొడుకు కొడుకూ కాదు.
* ఒక కల కనగానే తెల్లారుతుందా?
* ఒక కొడుకు కొడుకూ కాదు, ఒక చెట్టు తోపూ కాదు.
* ఒక చంట పాలు, ఒక చంట నెత్తురు.
* ఒక చెంపకొడితే పాలు, ఇంకొక చెంప కొడితే తేనె.
* ఒక చెయ్యి తట్టితే చప్పుడగునా?
* ఒక చేత పసుపు, ఇంకోచేత ముసుగు.
* ఒక చేతి వేళ్ళే ఇకలా ఉందవు.
* ఒకటె దెబ్బతో రెండు కాయలు కొట్టినట్లు.
* ఒకడిని చూస్తే పెట్టబుద్ధి, ఇంకొడిని చూస్తే మొట్టబుద్ధి.
* ఒకడి పాటు, పదిమంది సాపాటు.
* ఒకడు అగ్గిరాముడు, ఇంకొకడు మైరవణుడు.
* ఒకడు అహిరాముడు, ఇంకొకడు మహిరావణుడు.
* ఒకడు తిమి. ఇంకొకడు తిమింగలం.
* ఒకడూ పినతల్లికి తప్పినవాడూ, ఇంకొకడు తల్లికి తప్పినవాడు.
* ఇక తీగలాగితే పొదంతా కదిలినట్లు.
* ఒక దొడ్డి గొడ్లు పొడుచుకోవా?
* ఒకనాటి అదను, ఏడాది బ్రతుకు.
* ఒకనాటి పెళ్ళికి ముఖమంతా కాటుక.
* ఒకనాటి భోగం, ఆరునెలల రోగం.
* ఒకనాటి విందు, మరునాటి కుందు (మందు).
* ఒకనాటి వేషానికి (భోగతానికి) మూతిమీసాలు గొరిగించుకొన్నట్లు.
* ఒకనాటి సుఖం ఆరునెలల కష్టం.

No comments:

Post a Comment