Saturday, June 15, 2019

అ - ఆ >>>> 2

* అద్దంలొని ముడుపు అందిరాదు.
* అద్దం మీద ఆవగింజ పడ్డట్టు.
* అద్దంలో ముడుపు అరచేతి స్వర్గం.
* అద్దంలోని మూత అందిరాని మాట.
* అమ్మ రాకాసి, ఆలి భూకాసి.
* అమ్మి చిన్న ,కమ్మ పెద్ద.
* అమావాస్యకు తరువాత పౌర్ణమి రాదా?
* అమర్చినదానిలో అత్త వేలు పెట్టినట్లు.
* అమరితే ఆడది,అమరకుంటే బొడిది.
* అమ్మేదొకటి అసిమిలోదొకటి
* అత్త మిత్తి తోడికోడలు కత్తి.
* అత్త మంచి,వేము తీపి ఉండదు.
* అత్తపేరు పెట్టి కూతురిని కొట్టినట్లు.
* అత్త మెత్తన ,కత్తి మెత్తన ఉండవు.
* అన్ని పేర్లకు ఆషాడం తప్పదు.
* అన్నము చుట్టరికము, డబ్బు పగ.
* అన్యాయపు సంపాదన ఆవిరైపోతుంది.
* అప్పు తీర్చెవానికి పత్రంతో పనేముంది.
* అప్పు లేకపొతే ఉప్పు గంజైన మేలు.
* అరవ చెరుచు ,పాము కరుచు.
* అరచేతికి పండ్లొచ్చినట్లు.
* అరిగిన కంచు, మురిగిన చారు.
* అరపుల గొద్దు పితుకునా?.
* అరిక కలవదు అరక్షణం ఓపలేదు.
* అరికాలిలో కన్ను వాచినట్లు.
* అయితే ఆముదాలు కాకుంటే కందులు..
* అయ్య కదురువలె,అమ్మకుదురువలె.
* అవ్వను పట్టుకుని వసంతాలదినట్లు.
* అసలుది లేకపొతే అహంకారమెక్కువ.
* అసలు పసలేక దొంగని అరచినట్లు.

No comments:

Post a Comment