Saturday, June 15, 2019

అ - ఆ >>>> 3

* ఆ  ఊరి దొర ఈ ఊరికి తలారి
* ఆకారం పుష్టి,నైవేద్యం నష్టి.
* ఆకాసం పొడువు ఆకాసమే యెరుగు.
* ఆకు ఇస్తే అన్నం పెట్టినంత పుణ్యం.
* ఆకు వేసి నేల మీద వడ్డించినట్లు.
* ఆచారం ముందు,అనాచారం వెనుక.
* ఆడదే అమృతం,ఆడదే హాలహలం
* ఆడంబరానికి అంటకత్తెర వెసినట్టు.
* ఆడదానికి ఆయనకు ఆమడ దూరం.
* ఆడదాని మాట ఆపదలకు మూలం.
* ఆడ బిడ్డ మాటకు ఇరువైపులా పదునే.
* ఆడబోయిన చోటే తీర్థమెదురైనట్టు.
* ఆడ శోకం మొగరాగం ఒక్కటే.
* ఆత్రగానికి బుద్ది, మత్తు,ఆకలి యెక్కువ.
* ఆదాయం లేనిదే సెట్టి వరదనుబోడు.
* ఆ పప్పు ఈ నీళ్ళకు ఉదకదు.
* ఆబోతుకు బండే లేదు.
* ఆబోతు కండలకు ఱంకెలకు పెద్ద.
* ఆబోతుతో దుక్కిటెద్దు పోలుతుందా?
* ఆముదమున్న చొటే నీళ్ళాడినట్టు.
* ఆ మొద్దు లొదే ఈ పెడు కూడా.
* ఆయన లేని కూర అరటికాయకూర.
* ఆలి కుదురైతే చేను కుదురౌతుంది.
* ఆలి చచ్చిన వాడికి ఆడదే బంగారం.
* ఆలు లేని బడాయి నీళ్ళు తోడమన్నట్టు.
* ఆవులు కొరిన చొట పూరి మొలచినత్త్లు.
* ఆవును కొంటే దూడను కొన్నట్లే.
* ఆటా ముగిసింది, తంతీ తెగింది.
* ఆంద్రుల ఆరంభ శూరత్వం..
* ఆట విడుపు చేత దెబ్బలు.
* ఆరేసి మూదెట్టుకున్నట్టుంది.
* ఆడ పెత్తనము మాల భాగవతము.
* ఆశ్లేష వాన అరికాలు తేమ.

No comments:

Post a Comment